Advertisement

  • అన్ని వైరస్ వ్యాధుల లాగ సీజనల్ గా వచ్చే వ్యాధి కాదు కరోనా ..డబ్ల్యూహెచ్‌వో

అన్ని వైరస్ వ్యాధుల లాగ సీజనల్ గా వచ్చే వ్యాధి కాదు కరోనా ..డబ్ల్యూహెచ్‌వో

By: Sankar Tue, 11 Aug 2020 07:07 AM

అన్ని వైరస్ వ్యాధుల లాగ సీజనల్ గా వచ్చే వ్యాధి కాదు కరోనా ..డబ్ల్యూహెచ్‌వో



కోవిడ్‌ –19 సీజనల్‌గా వచ్చిపోయే వైరస్‌లాగా కనిపించడం లేదని, అందుకే దీన్ని కట్టడిచేయడం కష్టంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర సేవల విభాగం డాక్టర్‌ మైఖేల్‌ రయాన్‌ వెల్లడించారు.

ఈ వైరస్‌ ఏ సీజన్‌లో వస్తుందో చెప్పలేకపోతున్నామని, శ్వాస సంబంధిత వైరస్‌ ఇన్‌ఫ్లుయెంజా ప్రధానంగా శీతాకాలంలో వ్యాప్తి చెందుతుందని, అయితే కరోనా వైరస్‌ మాత్రం వేసవిలో కూడా విజృంభిస్తోందని ఆయన అన్నారు. కొందరు శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు కరోనా వైరస్‌ ఎండ వేడిమికి తట్టుకోలేదని, వేసవి కాలంలో మనగలగలేదని గతంలో ఊహించారు. వైరస్‌ని ఎంత అణచివేయాలని చూసినప్పటికీ అది తిరిగి విజృంభిస్తూనే ఉందని రయాన్‌ అన్నారు.

కాగా కరోనా వైరస్ మొదటిసారి వుహాన్ నగరంలో వెలుగుచూసే దాదాపు ఎనిమిది నెలలు అయింది ..ఇంతవరకు వైరస్ తగ్గలేదు సరికదా అంతకంతకు పెరుగుతూనే ఉంది ..వాక్సిన్ ప్రయోగాలు జరుగుతున్నప్పటికీ అవి ఇంకా పూర్తిస్థాయిలో అందరికి అందుబాటులో రావడానికి ఇంకా చాలా కాలం పడుతుంది ..బిల్ గేట్స్ లాంటి వ్యక్తులు కరోనా మహమ్మారి అదుపులోకి రావాలంటే ఇంకో ఏడాది అయిన పడుతుంది అని అన్నారు ..

Tags :
|
|
|

Advertisement