Advertisement

  • మహారాష్ట్రలో కరోనా తీవ్రత – 24 గంటల్లో ఏకంగా వంద మంది మృతి

మహారాష్ట్రలో కరోనా తీవ్రత – 24 గంటల్లో ఏకంగా వంద మంది మృతి

By: chandrasekar Thu, 28 May 2020 3:23 PM

మహారాష్ట్రలో కరోనా తీవ్రత – 24 గంటల్లో ఏకంగా వంద మంది మృతి


మహారాష్ట్రలో కరోనా వైరస్ ఎఫెక్ట్ తీవ్రంగా ఉంది. బుధవారం కూడా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవడంతో పాటు భారీగా మరణాలు చోటు చేసుకున్నాయి. మహారాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో ఏకంగా 2190 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇవాళ 964 మంది రోగులు డిశ్చార్జి కాగా మరో 105 మంది మరణించారు.

తాజా కేసులతో కలిపి మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 56,948కి చేరింది. కరోనా మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు 17,918 మంది కోలుకోగా 1,897 మంది మరణించారు. మహారాష్ట్రలో 37,125 యాక్టిక్ కరోనా కేసులున్నాయి.

coronavirus,maharashtra,one hundred,people,killed ,మహారాష్ట్రలో, కరోనా, తీవ్రత, 24 గంటల్లో, ఏకంగా


ఇక మహారాష్ట్రలో నమోదైన కేసుల్లో అత్యధికం ముంబైలోనే ఉన్నాయి. బుధవారం 1044 కొత్త కేసులు నమోదవడంతో పాటు 32 మంది మరణించారు. దాంతో ముంబైలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 33,835కి చేరింది. కరోనా మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు 1097 మంది మరణించారు.

మహారాష్ట్ర లో ముంబై లో ఎక్కువగా కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారితో పోరాడుతూ ఉన్నారు. మృతుల సంఖ్య కూడా అధికంగా ఉండటంతో ప్రజలు భయాందోనలు చెందుతున్నారు.

Tags :
|

Advertisement