Advertisement

  • కరోనా ను నిర్లక్ష్యం చేస్తే రెండో సారి భారీ మూల్యం చెల్లించాలి

కరోనా ను నిర్లక్ష్యం చేస్తే రెండో సారి భారీ మూల్యం చెల్లించాలి

By: Sankar Wed, 21 Oct 2020 08:53 AM

కరోనా ను నిర్లక్ష్యం చేస్తే రెండో సారి భారీ మూల్యం చెల్లించాలి


కరోనా వైరస్ నుంచి ప్రపంచం నినాదానంగా కోలుకుంటోంది. కేసులు తక్కువగా నమోదవుతున్నంత మాత్రానా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకున్నట్టు కాదు. కొన్ని దేశాల్లో ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి రెండోసారి తిరిగి విజృంభిస్తోంది. దీంతో ఆయా దేశాలు అప్రమత్తమయ్యి కట్టడికి చర్యలు తీసుకుంటున్నాయి.

ముఖ్యంగా యూరప్ దేశాల్లో సెకండ్ వేవ్ మొదలైంది. కరోనా ఒకసారి వచ్చి తగ్గిపోయిన తరువాత మరలా రాదు అనుకుంటే పొరపాటే అని ప్రపంచ ఆరోగ్యసంస్థ ఇప్పటికే తెలిపింది. కరోనా నుంచి కోలుకున్నాక శరీరంలో ఐదు నెలల లోపు యాంటీబాడీలు తగ్గితే తిరిగి కరోనా ఎటాక్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇలాంటి కేసులు ప్రపంచం మొత్తం మీద 24 నమోదైనట్టు తెలిపింది.

ఇండియాలో మూడు రీ ఇన్ఫెక్షన్ కేసులు నమోదైనట్టు ఐసీఎమ్ఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ తెలియజేశారు. అహ్మదాబాద్ లో ఒకటి, ముంబైలో రెండు రీ ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. కరోనా కట్టడికి తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలని, అలా చేస్తేనే కరోనా నుంచి బయటపడొచ్చని అన్నారు. కరోనా నిబంధనలు పాటించాలని తెలిపారు. నిబంధనలు పాటించకుంటే భారీ మూల్యం చెల్లించక తప్పదని అయన హెచ్చరించారు.

Tags :
|
|
|

Advertisement