Advertisement

  • డెన్మార్క్‌లో మింక్స్‌ అనే జీవులనుంచి కరోనా వైరస్‌ మనుషులకు

డెన్మార్క్‌లో మింక్స్‌ అనే జీవులనుంచి కరోనా వైరస్‌ మనుషులకు

By: chandrasekar Tue, 10 Nov 2020 10:05 AM

డెన్మార్క్‌లో మింక్స్‌ అనే జీవులనుంచి కరోనా వైరస్‌ మనుషులకు


డెన్మార్క్‌లో మింక్స్‌ అనే జీవులనుంచి కరోనా వైరస్‌ మనుషులకు వ్యాపిస్తున్నట్లు గుర్తించారు. ఆ దేశంలో కరోనా వైరస్‌ మ్యుటేషన్‌ను ఇటీవల పరిశోధకులు గుర్తించారు. డెన్మార్క్‌లో మింక్స్‌ అనే జీవులనుంచి కరోనా వైరస్‌ మనుషులకు సోకినట్లు తాజాగా గుర్తించారు. ఆ దేశానికి చెందిన స్టేటెన్స్‌ సీరం ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులు ఈ విషయాన్ని కనుగొన్నారు. దీంతో మళ్లీ మహమ్మారి విజృంభించే ప్రమాదం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అభివృద్ధి చేసిన టీకాల పనితీరుపైనా అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన ఆ దేశం మింక్స్‌ ఫామ్స్‌ ఎక్కువగా ఉండే ఉత్తర జట్లాండ్‌ ప్రాంతంలో ఆంక్షలు విధించింది. 15 మిలియన్ల మింక్‌లను చంపేందుకు డెన్మార్క్‌ సర్కారు సిద్ధమైంది. ప్రపంచంలో అతిపెద్ద మింక్ బొచ్చు (మింక్‌ ఫర్‌) ఎగుమతిదారుగా డెన్మార్క్ వుంది. ఈ దేశం ప్రపంచ మింక్ ఫర్‌ ఉత్పత్తిలో 40 శాతం వాటాను కలిగి ఉంది. దాని ఎగుమతుల్లో ఎక్కువ భాగం చైనా, హాంకాంగ్‌లకు వెళ్తాయి. కాగా, జూన్ నుంచి అక్టోబర్ మధ్య వరకు డెన్మార్క్‌లోని మింక్‌ ఫామ్స్‌ నుంచి మ్యుటేషన్‌ చెందిన కరోనావైరస్ 214 మందికి సోకినట్లు పరిశోధకులు తేల్చారు. వీరిలో 200 మంది ఉత్తర జట్లాండ్ ప్రాంతంలో ఉన్నారు. డానిష్ ప్రధాని మెట్టే ఫ్రెడెరిక్సన్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

డెన్మార్క్‌లో ఉత్తరాన ఉన్న మింక్‌ ఫామ్స్‌లో మ్యుటేషన్‌ చెందిన కరోనా వైరస్‌ను గుర్తించినట్లు చెప్పారు. మింక్స్‌ నుంచి వైరస్‌ మనుషులకు సోకిందని వెల్లడించారు. ఈ ప్రాంతంలో రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ప్రజారవాణా నిలిపివేస్తున్నామని, ప్రాంతీయ సరిహద్దులు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అత్యవసర విధులకు మాత్రమే అనుమతి ఉందని వెల్లడించారు. ఉత్తర జట్లాండ్‌ ప్రాంతంలోని వారందరూ కొవిడ్‌ టెస్టులు చేయించుకోవాలని కోరారు. మింక్స్‌ నుంచి మనుషులకు కరోనా సోకిందనే వార్తల నేపథ్యంలో బ్రిటన్‌ సర్కారు అప్రమత్తమైంది. డెన్మార్క్‌కు రాకపోకలపై నిషేధం విధించింది. 14 రోజులుగా డెన్మార్క్ గుండా ప్రయాణించిన దేశ పౌరులను ఇంగ్లాండ్‌లోకి ప్రవేశించకుండా అడ్డుకుంటోంది. ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. డెన్మార్క్ నుంచి ప్రయాణించే విమానాలు, నౌకలు, దానితో పాటు ఏవైనా సరుకు రవాణా మార్గాలను నిలిపివేసింది. డెన్మార్క్‌ నుంచి యూకేకి వచ్చినవారు స్వీయనిర్బంధంలో ఉండాలని ఆదేశించింది. డెన్మార్క్‌లో వెలుగుచూసిన కరోనా జన్యుపరివర్తనపై ఇంకా స్పష్టతలేదని, అయితే, తమ దేశ పౌరులను కాపాడుకునేందుకు ఆంక్షలు విధించామని బ్రిటీష్‌ రవాణా శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దీనివల్ల వైరస్ వ్యాప్తి తగ్గించుకోవచ్చు.

Tags :

Advertisement