Advertisement

  • కరోనా వైరస్ వ్యాప్తి ఇప్పట్లో తగ్గదు ..వచ్చే ఏడాది కూడా కొనసాగుతుంది ..ఎయిమ్స్

కరోనా వైరస్ వ్యాప్తి ఇప్పట్లో తగ్గదు ..వచ్చే ఏడాది కూడా కొనసాగుతుంది ..ఎయిమ్స్

By: Sankar Sun, 06 Sept 2020 3:01 PM

కరోనా వైరస్ వ్యాప్తి ఇప్పట్లో తగ్గదు ..వచ్చే ఏడాది కూడా కొనసాగుతుంది ..ఎయిమ్స్


చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే... ఈ కరోనా వైరస్ వ్యాప్తి గురించి ఢిల్లీలోని ఎయిమ్స్ కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి ఇప్పట్లో తగ్గదని, వచ్చే ఏడాది కూడా కొనసాగుతుందని తెలిపింది. జనసంచారం మళ్లీ పెరగడంతోపాటు గ్రామాలకు కూడా వైరస్ వ్యాపించిందని తెలిపారు.

కరోనా పరీక్షలు పెంచిన కారణంగా వచ్చే ఏడాది కూడా వైరస్ వ్యాప్తి కొనసాగుతుందని ఎయిమ్ డైరెక్టర్, భారత్ కొవిడ్ టాస్క్‌ఫోర్స్ సభ్యుడు డాక్టర్ రణ్‌దీప్ గులేరియా పేర్కొన్నారు. కేసుల వేగం పెరిగిన తర్వాత క్రమంగా తగ్గుముఖం పడతాయని వివరించారు. ఒక నిర్దిష్ట రేటులో కొంతకాలం పాటు వైరస్ వ్యాప్తి కొనసాగే అవకాశం ఉందని గులేరియా అభిప్రాయపడ్డారు..

కాగా ప్రపంచంలో ఒక్క రోజు నమోదు అవుతున్న కరోనా కేసుల్లో అత్యధిక కేసులు ఇండియాలోనే నమోదు అవుతుండటం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తుంది..తాజాగా 90వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి ..మహారాష్ట్ర , ఏపీ , తమిళనాడు , కర్ణాటక వంటి రాష్ట్రాలలో అత్యధిక కేసులు నమోదు అయితున్నాయి..

Tags :
|
|

Advertisement