Advertisement

  • టాయిలెట్ల ద్వారా కూడా ఒక ఇంటి నుంచి మరో ఇంటికి కరోనా వైరస్

టాయిలెట్ల ద్వారా కూడా ఒక ఇంటి నుంచి మరో ఇంటికి కరోనా వైరస్

By: chandrasekar Fri, 28 Aug 2020 4:59 PM

టాయిలెట్ల ద్వారా కూడా ఒక ఇంటి నుంచి మరో ఇంటికి కరోనా వైరస్


చైనాలోని గాంగ్జౌ లో చాలాకాలంగా ఎవరూ లేని ఓ అపార్ట్ మెంట్ బాత్రూంలో కరోనా వైరస్ ఆనవాళ్లను కనుగొన్నట్లు వారు ప్రకటించారు. టాయిలెట్ల ద్వారా కరోనా వైరస్ ఒక ఇంటి నుంచి మరో ఇంటికి, ముఖ్యంగా అపార్ట్ మెంట్లలో ఒక ఫ్లాట్ నుంచి మరో ఫ్లాట్ కి వ్యాపిస్తోందని చైనీస్ సైంటిస్టులు గుర్తించారు. అపార్ట్ మెంట్ కింద ఇంట్లో ఉంటున్న ఐదుగురికి వారం రోజుల క్రిందట కరోనా పాజిటివ్ వచ్చింది. వారు ఉపయోగించిన టాయిలెట్ నుంచే వైరస్ పై అపార్ట్ మెంట్ లోని బాత్రూంలోకి చేరి ఉంటుందని చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకటించింది.

సైంటిస్టులు కరోనా సోకిన పేషెంట్ల మలంలో వైరస్ కణాలు ఉంటున్నట్లు ఇదివరకే గుర్తించారు. దీంతో వారు టాయిలెట్లు యూజ్ చేశాక, నీటిని ఫ్లష్ చేసినప్పుడు టాయిలెట్ పైపుల్లో గ్యాస్, ఏరోసాల్స్ ఏర్పడి, వాటితో వైరస్ కలిసిపోయి పైపుల ద్వారా పైకి వస్తోందని చైనా సీడీసీ తెలిపింది. ఆన్ సైట్ ట్రేసర్ సిమ్యులేషన్ ఎక్స్ పెరిమెంట్ ద్వారా ఆ అపార్ట్ మెంట్ బాత్రూంను పరిశీలించగా, అక్కడి సింక్, నల్లా, షవర్ హ్యాండిల్ పై కూడా వైరస్ ఆనవాళ్లు ఉన్నట్లు అంచనాకు వచ్చినట్లు తెలిపింది.

కరోనా పేషెంట్లు ఉంటున్న అపార్ట్ మెంట్లకు పైన 10, 12వ అంతస్తుల్లోని బాత్రూంల వరకూ వైరస్ వ్యాపించే అవకాశం ఉందని సీడీసీ పేర్కొంది. ఇటీవల విమానంలోని ఓ మహిళకు టాయిలెట్ ద్వారా కూడా కరోనా సోకినట్లు సైంటిస్టులు గుర్తించారు. ఎలాంటి సింప్టమ్స్ లేని కరోనా పేషెంట్ వాడిన తర్వాత ఆమె టాయిలెట్ కు వెళ్లడంతో వైరస్ సోకినట్లు తేలింది. కాగా, పదిహేడేళ్ల క్రిందట హాంకాంగ్ లో సార్స్ వైరస్ తీవ్రంగా వ్యాపించింది. ఆ సమయంలోనూ హాంకాంగ్ లోని అమోయ్ గార్డెన్స్ అపార్ట్ మెంట్లలో వైరస్ టాయిలెట్ల ద్వారా వ్యాపించినట్లు పలు రీసెర్చ్ లలో వెల్లడైంది.

Tags :
|
|
|

Advertisement