Advertisement

  • అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్‌ ఆందోళనకర రీతిలో విలయతాండవం

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్‌ ఆందోళనకర రీతిలో విలయతాండవం

By: chandrasekar Fri, 31 July 2020 10:06 AM

అగ్రరాజ్యం అమెరికాలో  కరోనా వైరస్‌ ఆందోళనకర రీతిలో విలయతాండవం


అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తోంది. ప్రతిరోజూ వెయ్యికిపైగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. బుధవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 1,461 మంది చనిపోయారు. అమెరికాలో ఆందోళనకరరీతిలో 24 గంటల్లో ప్రతినిమిషానికి ఒకరు కరోనాతో మృతి చెందారు. గురువారంతో అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 1,53,845కు చేరింది. ప్రపంచంలోనే అత్యధిక కరోనా మరణాలు అమెరికాలోనే సంభవించాయి.

గత రెండు నెలల్లో కరోనా మరణాల రేటు గణనీయంగా పెరిగింది. కాలిఫోర్నియా(185), ఫ్లోరిడా(217), టెక్సాస్‌(311) రాష్ట్రాల్లో మరణాలు అధికంగా ఉన్నాయి. అమెరికాలో ఇప్పటి వరకు 45,68,375 మందికి కరోనా సోకగా 22,45,521 కోలుకున్నారు. చాల వేగంగా కరోనా అగ్రరాజ్యంలో వ్యాపిస్తావుంది. ఇక్కడ అధికంగా కఠిన చర్యలు చేపట్టకపోవడమే కారణమని చాలామంది తెలియజేస్తున్నారు.

Tags :
|

Advertisement