Advertisement

Breaking: తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా..!

By: Anji Sun, 04 Oct 2020 09:18 AM

Breaking: తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా..!

తెలంగాణలో శనివారం తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు.. ఇవాళ మళ్లీ పెరిగాయి... తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 1,949 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 10 మంది మృతిచెందారు. ఇదే సమయంలో 2,366 మంది రికవరీ అయ్యారు.

దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 1,99,276కు చేరుకోగా.. ఇప్పటి వరకు 1,70,212 మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నారు.. ఇక, 1163 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 27,901 యాక్టివ్ కేసులు ఉండగా... హోం క్వారంటైన్‌, ఐసోలేషన్లలో 22,816 మంది ఉన్నట్టు ప్రభుత్వం తన బులెటిన్‌లో పేర్కొంది.

గత 24 గంటల్లో 51,623 టెస్ట్‌లు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో రికవరీ రేటు 84.1 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో అది 85.41 శాతానికి పెరిగింది.. ఇక, డెత్‌రేట్ దేశంలో 1.6 శాతంగా ఉంటే.. తెలంగాణలో 0.58 శాతంగా ఉంది.

Tags :

Advertisement