Advertisement

  • వ్యాధి నిరోధక శక్తి ఉన్నవారినుంచి ఇతరులకు కరోనా వైరస్‌ వ్యాపించడంలేదు: అమెరికన్‌ వర్సిటీ పరిశోధకులు

వ్యాధి నిరోధక శక్తి ఉన్నవారినుంచి ఇతరులకు కరోనా వైరస్‌ వ్యాపించడంలేదు: అమెరికన్‌ వర్సిటీ పరిశోధకులు

By: chandrasekar Fri, 18 Sept 2020 2:57 PM

వ్యాధి నిరోధక శక్తి ఉన్నవారినుంచి ఇతరులకు కరోనా వైరస్‌ వ్యాపించడంలేదు: అమెరికన్‌ వర్సిటీ పరిశోధకులు


ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ గురించి పరిశోధకులు అధ్యయనాలు చేస్తూనే ఉన్నారు. కరోనా వాక్సిన్ కోసం ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. కొందరు నిపుణులైతే మనం కరోనాతో సహజీవనం చేయాల్సిందేనని కూడా అన్నారు. ఇప్పుడు వీరి మాటలే నిజమని చెబుతోంది ఓ అధ్యయనం. హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించిన తర్వాత కరోనా వైరస్‌ అనేది సీజనల్‌గా వస్తుందని లెబనాన్‌లోని అమెరికన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ బీరుట్‌ పరిశోధకులు తేల్చారు. వ్యాధినిరోధక శక్తి ఎక్కువగా ఉన్నవారిలో ఇది కనిపించదని నిర్ధారించారు. ఈ అధ్యయన ఫలితాలు ఫ్రాంటియర్స్‌ ఇన్‌ పబ్లిక్‌ హెల్త్‌ పత్రికలో ప్రచురితమయ్యాయి. పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు కాలానుగుణ వైరస్ లను క్షుణ్నంగా పరిశీలించారు. అలాగే, వాటితో పోల్చి సార్స్‌ సీఓవీ-2 తీవ్రతను అంచానా వేశారు. గాలి, ఉపరితలాలపై వైరస్‌ మనుగడ సాగించగలదని మరోసారి తేల్చారు. ఇండోర్‌లలో ఎక్కువ వ్యాప్తి కలిగి ఉంటుందని నిర్ధారించారు. హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించేదాకా ప్రతి సీజన్‌లోనూ ఇది వ్యాప్తి చెందుతుందని తేల్చారు. దీని వ్యాప్తి అనేది వాతావరణం, ఉష్ణోగ్రత, గాలిలో తేమశాతంపై ఆధారపడి ఉంటుందని నిర్ధారించారు. ఇన్‌ఫ్లుయెంజా, ఫ్లూ వైరస్‌లతో పోలిస్తే కరోనా వైరస్ ఎక్కువ వ్యాప్తి చెందే అవకాశముందని నిర్ధారించారు. వాటిలాగా, కరోనా వ్యాప్తికి కాలంతో సంబంధం లేదని తేల్చారు. అయితే, టీకాల ద్వారా హెర్డ్‌ ఇమ్యూనిటీ వచ్చాక కరోనా‌ వ్యాప్తి గణనీయంగా పడిపోతుందని గుర్తించారు. అప్పుడు అది కాలనుగుణంగా మారుతుందని కనుగొన్నారు.

హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించేవరకు వైరస్ వేగంగా వ్యాప్తి

హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించేవరకు ఏడాది పొడవునా కరోనా వ్యాప్తి ఉంటుందని అమెరికన్‌ వర్సిటీ పరిశోధకులు తేల్చారు. ఆ లోగా వైరస్‌ మ్యుటేషన్‌ చెందినా ఆశ్చర్యపోనక్కర్లేదని వారు తెలిపారు. అయితే, వ్యాధి నిరోధక శక్తి ఉన్నవారినుంచి ఇతరులకు కరోనా వైరస్‌ వ్యాపించడంలేదని కూడా తేల్చారు. అంటే కరోనా పాజిటివ్‌ వ్యక్తికి ఇమ్యూనిటీ పవర్‌ ఉంటే అతడితో కలిసి ఉన్నవారికి వైరస్‌ సంక్రమణ జరుగడం లేదని గుర్తించారు. ఏదిఏమైనా ప్రజలంతా కరోనా వైరస్‌తో జీవించడం నేర్చుకోవాలని తమ అధ్యయనం సూచిస్తున్నట్లు అధ్యయనకర్త హసన్‌ జరాకెట్ పేర్కొన్నారు. టీకా వచ్చేంతవరకూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాల్సిందేనని చెప్పారు. అవసరముంటే ఇంటినుంచి బయటకి వెళ్లాలని, చేతులను ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేసుకోవాలని, ఒకేచోట గుమికూడవద్దని తెలిపారు.

Tags :
|
|

Advertisement