Advertisement

  • కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ గుంటూరులో తొలి రోజు ఒకరికి....ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి...

కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ గుంటూరులో తొలి రోజు ఒకరికి....ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి...

By: chandrasekar Wed, 25 Nov 2020 9:11 PM

కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ గుంటూరులో తొలి రోజు ఒకరికి....ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి...


కరోనా వైరస్ టీకా కొవాగ్జిన్‌పై మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ లో భాగంగా వలంటీర్లకు టీకాలు వేసే ప్రక్రియను బుధవారం గుంటూరు జిల్లా కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌, జేసీ ప్రశాంతి లాంఛనంగా ప్రారంభించారు.

క్లినికల్‌ పరీక్షల్లో భాగంగా వెయ్యి మందికి టీకా వేయనున్నారు. గుంటూరు ఫీవర్ ఆస్పత్రిలో ప్రారంభమైన ఈ ప్రక్రియలో బుధవారం వలంటీర్‌గా వచ్చిన ఓ వ్యక్తికి టీకా వేశామని.. నెల రోజుల్లోగా వెయ్యి మందికి టీకా ఇచ్చి క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించాల్సి ఉంటుందని కలెక్టర్‌ వెల్లడించారు.

ట్రయల్స్‌లో భాగంగా వలంటీర్లకు రెండు డోసులు ఇవ్వాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. మొదటి డోసు ఇచ్చిన 28 రోజుల తర్వాత నెగెటివ్‌ వచ్చిన వారికి మరో డోసు ఇవ్వనున్నట్లు వివరించారు. ప్రజలకు కరోనా నుంచి విముక్తి కలిగించే ప్రక్రియలో ఆసక్తి ఉన్నవారు ఈ ప్రక్రియలో పాల్గొనాలని ఈ సందర్భంగా గుంటూరు జిల్లా అధికారులు పిలుపునిచ్చారు. ఇందు కోసం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు.

Tags :

Advertisement