Advertisement

  • కరోనా వాక్సిన్ తొలి దశ క్లినికల్ ట్రయల్స్ ..వాలంటీర్లకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు ..నిమ్స్

కరోనా వాక్సిన్ తొలి దశ క్లినికల్ ట్రయల్స్ ..వాలంటీర్లకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు ..నిమ్స్

By: Sankar Tue, 21 July 2020 4:11 PM

కరోనా వాక్సిన్ తొలి దశ క్లినికల్ ట్రయల్స్ ..వాలంటీర్లకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు ..నిమ్స్



కరోనా వాక్సిన్ తొలి దశ ప్రయోగాలు భారత్ లో ప్రారంభం అయ్యాయి ..ఇప్పటికే రష్యా వంటి దేశాలు రెండు దశల్లో కరోనా వాక్సిన్ క్లినికల్ ట్రైల్స్ పూర్తి చేసాయి..తాజాగా హైదరాబాద్ లోని నిమ్స్ లో కూడా తొలి దశ కరోనా వాక్సిన్ ప్రయోగాలు సక్సెస్ అయ్యాయి ...సోమవారం నిమ్స్ హాస్పిటల్‌లో ఇద్దరు వాలంటీర్లకు కరోనా టీకా ఇవ్వగా.. వారు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని వైద్య నిపుణులు తెలిపారు. ఎలాంటి అలర్జీలు, అవయాలపై దుష్ప్రభావం లాంటివి లేవని.. దీంతో వారిని డిశ్చార్జ్ చేశామన్నారు. ఇది చాలా మంచి పరిణామనన్నారు. ఐసీఎంఆర్ రూపొందించిన ప్రోటోకాల్ ప్రకారం రెండో దశ కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు చేపడతామన్నారు.

క్లినికల్ ట్రయల్స్ కోసం దేశంలోని 12 వైద్య కేంద్రాల్లో మొత్తం 60 మంది వాలంటీర్లను ఎన్నుకున్నారు. ఫేజ్-1 ట్రయల్స్ ఫలితాలు 14 రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. ఆ తర్వాత రెండో దశ వ్యాక్సిన్ డోస్ ఇస్తారు.అక్టోబర్‌లోగా వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో భారత్ బయోటెక్ సంస్థ ఉందని నిమ్స్ వైద్య నిపుణులు తెలిపారు. వైరస్‌ను కట్టడి చేయడం కోసం ప్రపంచ దేశాలు ప్రయోగాలతో సమాంతరంగా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తున్నాయన్నారు.

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ రూపొందించిన కరోనా వైరస్ వ్యాక్సిన్ రెండు దశల్లోనూ మనుషులపై ప్రయోగాలు విజయవంతమైంది. ఈ వ్యాక్సిన్‌ను భారత్‌లోనూ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తామని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది.

Tags :
|
|

Advertisement