Advertisement

  • 2021 నాటికి దేశంలో విస్తృతంగా అందుబాటులోకి కరోనా వాక్సిన్: జర్మనీ ఆరోగ్య మంత్రి

2021 నాటికి దేశంలో విస్తృతంగా అందుబాటులోకి కరోనా వాక్సిన్: జర్మనీ ఆరోగ్య మంత్రి

By: chandrasekar Thu, 17 Sept 2020 12:18 PM

2021 నాటికి దేశంలో విస్తృతంగా అందుబాటులోకి కరోనా వాక్సిన్: జర్మనీ ఆరోగ్య మంత్రి


బెర్లిన్‌లో విలేకరుల సమావేశంలో జర్మనీ ఆరోగ్య మంత్రి జెన్స్‌స్పాన్‌ మాట్లాడుతూ ... 2021 మధ్య నాటికి దేశంలో విస్తృతంగా కరోనా టీకా అందుబాటులోకి వస్తుందని తాము భావిస్తున్నట్లు తెలిపారు.

దేశ రాజధాని బెర్లిన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... తమ సొంత కరోనా వ్యాక్సిన్‌ ద్వారానే దేశంలో హెర్డ్‌ ఇమ్యూనిటీకి చేరుకోవాలని చూస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం 55 నుండి 65 శాతం జనాభాకు వ్యాక్సిన్‌ వేయాల్సి ఉంటుందన్నారు.

అయితే, టీకా రాగానే మొదట వృద్ధులు, ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు వేస్తామని చెప్పారు. ఎక్కువ మంది జర్మన్లు ​​టీకాలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

Tags :

Advertisement