Advertisement

  • కరోనా వాక్సిన్ ఉత్పత్తి కేంద్రంగా హైదరాబాద్‌

కరోనా వాక్సిన్ ఉత్పత్తి కేంద్రంగా హైదరాబాద్‌

By: chandrasekar Mon, 14 Sept 2020 09:12 AM

కరోనా వాక్సిన్ ఉత్పత్తి కేంద్రంగా హైదరాబాద్‌


ప్రపంచంలో వాక్సిన్ ఎక్కడ కనుగొన్నా దానిని అధికమొత్తంలో తాయారు చేయగల సామర్ధ్యం హైదరాబాద్‌కు మాత్రమే వుంది. కొవిడ్ -19 వ్యాప్తి ప్రారంభమైననాటినుంచి చాలా దేశాలు టీకా కోసం ప్రయత్నాలు ప్రారంభించాయి. ఎంతో మంది శాస్త్రవేత్తలు నిర్విరామ కృషిచేస్తున్నారు. ఇప్పటికే పలు వ్యాక్సిన్‌లు మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో ఉన్నాయి. అయితే, వీటిని అభివృద్ధి చేయడం ఒక ఎత్తయితే వీటి ఉత్పత్తి మరో ఎత్తు. దీనిని సమర్థంగా నిర్వహించగల సత్తా ప్రపంచంలోనే కేవలం చైనా, భారత్‌కు మాత్రమే ఉన్నాయి. భారతదేశంలో ఈ సామర్థ్యం కేవలం హైదరాబాద్‌కు మాత్రమే ఉంది. అందుకే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహామహా కంపెనీలు కొవిడ్‌ వ్యాక్సిన్‌ సరఫరా కోసం భాగ్యనగరం వైపు చూస్తున్నాయి. ప్రపంచానికే కరోనా వైరస్‌ను సరఫరా చేయగల మూడింట ఒకవంతు సామర్థ్యం హైదరబాద్‌ కలిగి ఉంది. దేశ మొట్టమొదటి స్వదేశీ కొవిడ్ -19 వ్యాక్సిన్ కొవాగ్జిన్‌, రష్యా స్పుత్నిక్ వీ, జాన్సన్ అండ్‌ జాన్సన్ కంపెనీ ఏడీ 26.సీఓవీ2ఎస్‌, ఫ్లూజెన్ కోరోఫ్లూ, సనోఫీ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లు హైదరాబాద్‌తో సంబంధం కలిగి ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా వాక్సిన్ ఉత్పత్తి కోసం ఇక్కడి కంపెనీలతో టచ్‌లో ఉన్నాయి. వ్యాక్సిన్‌ అనేది హైదరాబాద్‌లో అభివృద్ధి చేసినా లేదా ప్రపంచంలో ఎక్కడ తయారైనా ఉత్పత్తి, సరఫరా మాత్రం హైదరాబాద్‌నుంచే కావాల్సిందేనని శాంత బయోటెక్నిక్స్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, చైర్మన్ డాక్టర్ వరప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. అన్ని హైదరాబాద్‌ ఫార్మా కంపెనీలు ఉత్పాదక సాంకేతిక పరిజ్ఞానంలో దృఢంగా ఉన్నాయి. అలాగే, మంచి ప్రమాణాలతో మిలియన్‌ మోతాదుల వ్యాక్సిన్లను తయారుచేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.’ అని వరప్రసాద్‌రెడ్డి తెలిపారు. సనోఫీ కంపెనీ టీకాను 2021 మొదటి భాగంలో ఇక్కడ పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేసేందుకు వరప్రసాద్‌రెడ్డి ఎదురుచూస్తున్నారు. సనోఫీ కంపెనీ 2009 లో శాంత బయోటెక్నిక్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కొవిడ్‌ వ్యాక్సిన్‌ తయారీకి ప్రపంచంలోనే అనువైన ప్రదేశం హైదరాబాద్‌ మాత్రమేనని, ఇది టీకా తయారీ సామర్థ్యం కలిగి ఉందని బయోలాజికల్ ఇ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మహిమ దాట్ల పేర్కొన్నారు. ఈ కంపెనీ సొంతంగా టీకా అభివృద్ధి కోసం టెక్సాస్‌లోని బేలర్‌ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది.

హైదరాబాద్ ఔషధ కంపనీలకు హబ్ గా ఉండడం వల్ల జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీ వ్యాక్సిన్‌ను హైదరాబాద్‌లో తయారుచేసేందుకు సాంకేతిక సహాయాన్ని అందజేస్తున్నది. మహిమ దాట్ల, అభివృద్ధి చెందుతున్న దేశాల వ్యాక్సిన్ తయారీదారుల నెట్‌వర్క్ (డీసీవీఎంఎన్) అధ్యక్షురాలిగా ఉన్నారు. ఆమె మాట్లాడుతూ, వ్యాక్సిన్‌ను ప్రపంచవ్యాప్తంగా చాలా అకాడమిక్‌ ల్యాబోరేటరీలు లేదా వ్యాక్సినేతర సంస్థలు అభివృద్ధి చేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. అయితే, వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు లేవన్నారు. దీంతో వారు భారత్‌ లేదా చైనాలోని సంస్థలతో భాగస్వామి కావడం తప్ప వేరే మార్గం లేదని మహిమ వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో టీకా ఉత్పత్తికోసం అనేక మంది తయారీదారులు చర్చలు జరుపుతున్నట్లు ఆమె చెప్పారు. ఎన్డీడీబీ ఏర్పాటు చేసిన మానవ, జంతు వ్యాక్సిన్ల తయారీ సంస్థ ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ కొత్త 20 మిలియన్ సింగిల్ డోస్ (200 మిలియన్ మల్టీ-డోస్) ఫిల్ ఫినిషింగ్ కెపాసిటీని కలిగి ఉందని, థర్డ్‌ పార్టీ కొవిడ్‌ వ్యాక్సిన్‌ తయారీకి హైదరాబాద్ శివార్లలోని జీనోమ్ వ్యాలీ వద్ద ఇది సిద్ధంగా ఉందని మహిమ తెలిపారు.

అధిక సంఖ్యలో ప్రపంచానికి సరఫరా చేయడానికి స్పుత్నిక్ వీ టీకాను ఉత్పత్తి చేసేందుకు రష్యాతో చర్చలు నడుస్తున్నాయని వివరించారు. ఎవరి టీకా ఎప్పుడు అభివృద్ధి అవుతుందో తెలియదని, కానీ విజయవంతమైన వారి టీకాలను ఉత్పత్తి చేసేందుకు హైదరాబాద్‌లోని కంపెనీలు రెడీగా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్ విశ్వవిద్యాలయం సహకారంతో అభివృద్ధి చెందుతున్న మా సొంత టీకా అనుమతి పొందేందుకు 18 నెలల సమయం పడుతుందని, ఆలోగా ఇతర కొవిడ్ -19 వ్యాక్సిన్ల తయారీకి తాము సిద్ధంగా ఉన్నామని ఐఐఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కే ఆనంద్ కుమార్ చెప్పారు. హైదరాబాద్‌లోని అరబిందో ఫార్మా కూడా ఈ ఏడాది ప్రారంభంలో అమెరికాకు చెందిన ఆర్ అండ్ డీ కంపెనీని కొనుగోలు చేయడంతో కొవిడ్ -19 వ్యాక్సిన్ డెవలప్‌మెంట్ బ్యాండ్‌వాగన్‌పైకి దూసుకెళ్లింది.

త్వరలోనే సమర్థవంతమైన వ్యాక్సిన్‌ను తీసుకువచ్చేందుకు కృషిచేస్తున్నాం. మార్చి 2021 నాటికి టీకా ఉత్పత్తికి మేం సిద్ధంగా ఉన్నాం. ఆ సామర్థ్యం తమకుంది.’ అని ఐఐఎల్ డిప్యూటీ ఎండీ ప్రసన్న దేశ్‌పాండే అభిప్రాయపడ్డారు. ప్రపంచానికి కొవిడ్ -19 టీకాను అందించి, మహమ్మారిని తరిమికొట్టే యుద్ధంలో తెలంగాణ సర్కారు కూడా తనవంతు పాత్ర పోషిస్తోంది. హైదరాబాద్‌లోని కంపెనీలకు తగిన సహాయ సహకారాలు అందిస్తోంది. వ్యాక్సిన్‌ ఉత్పత్తి, రవాణాకు కావాల్సిన అనుమతులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ‘కొవిడ్ -19 కు వ్యతిరేకంగా గ్లోబల్ టీకా ప్రయత్నాల్లో కీలక పాత్ర పోషించడానికి మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాం. ప్రపంచానికి సేవ చేసేందుకుగానూ ఉత్పత్తిని త్వరగా పెంచేందుకు మా కంపెనీలకు ముందుగానే మద్దతు ఇస్తున్నాం అని తెలంగాణ ఐటీ, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్ పేర్కొన్నారు. త్వరగా వాక్సిన్ వస్తేనే కరోనా ని కట్టడి చేయవచ్చు.

Tags :
|
|

Advertisement