Advertisement

  • డిసెంబర్‌ నాటికి కరోనా టీకా కోవిషీల్డ్ అందుబాటులోకి...

డిసెంబర్‌ నాటికి కరోనా టీకా కోవిషీల్డ్ అందుబాటులోకి...

By: chandrasekar Thu, 29 Oct 2020 09:24 AM

డిసెంబర్‌ నాటికి కరోనా టీకా కోవిషీల్డ్ అందుబాటులోకి...


కరోనా వల్ల ఆర్ధిక సంక్షోభంతో బాటు చాలా మంది ప్రాణాలు పోగుట్టుకున్నారు. అందరు వాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నారు. దేశంలో డిసెంబర్‌ నాటికి కరోనా టీకా కోవిషీల్డ్ అందుబాటులోకి రావచ్చని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎస్‌ఐ) సీఈఓ అదార్ పూనవల్లా తెలిపారు. అత్యవసర లైసెన్స్‌ కోసం ప్రయత్నించకపోతే క్లినికల్‌ ట్రయల్స్‌ డిసెంబర్‌లో పూర్తయి వచ్చే ఏడాది జనవరిలో టీకా అందుబాటులోకి వస్తుందని చెప్పారు. అయితే బ్రిటన్‌లో ఈ టీకా వినియోగ సమాచారం, డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) నిర్ణయంపై ఇది ఆధారపడి ఉంటుందని అన్నారు. బ్రిటన్‌లో వచ్చే నెల నుంచి కరోనా టీకాను అందుబాటులోకి తీసుకురావాలని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ బృందం నిర్ణయించింది. ఈ వాక్సిన్ ను తొలుత వైద్యులు, వైద్య సిబ్బందికి ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌లో కరోనా టీకా అందుబాటు గురించి ఎస్‌ఎస్‌ఐ సీఈఓ అదార్‌ మీడియాతో మాట్లాడారు. బ్రిటన్‌లో అంతా సవ్యంగా జరిగితే దేశంలో డిసెంబర్‌ నాటికి టీకాను అందుబాటులోకి తేవచ్చని చెప్పారు. తొలుత 10 కోట్ల డోసులను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

కరోనా కోసం తయారు చేసిన ఈ కోవిషీల్డ్ వాక్సిన్ రెండు డోసుల టీకా అని చెప్పారు. ఒక డోసు టీకా వేసిన 28 రోజుల తర్వాత మరో డోసు టీకా వేయాల్సి ఉంటుందని అన్నారు. రెండు డోసుల టీకా వ్యయంపై ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నందున దీనిపై ఇప్పుడే వ్యాఖ్యానించబోనని ఆయన చెప్పారు. అయితే మిగతా టీకాల కంటే చౌకగానే లభిస్తుందన్నారు. బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఔషధ కంపెనీ ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ మూడో దశ పరీక్షలు ప్రస్తుతం అక్కడ జరుగుతున్నాయి. బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీకి చెందిన జెన్నర్ ఇన్స్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన, ఆస్ట్రాజెనెకా నుండి లైసెన్స్ పొందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎస్‌ఐ) కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌పై దేశంలోని సుమారు 1600 మంది వలంటీర్లపై తుది దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తున్నది. ఇది విజయవంతమైతే టీకా ఉత్పత్తి, సరఫరాపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని భావిస్తున్నది. దాదాపు చాలా ఔషధ కంపెనీలు ఈ డిసెంబర్ కు కరోనా టీకాను విడుదల చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నది.

Tags :
|

Advertisement