Advertisement

  • రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ వేయిస్తా మన్న తమిళనాడు సీఎం

రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ వేయిస్తా మన్న తమిళనాడు సీఎం

By: chandrasekar Fri, 23 Oct 2020 09:16 AM

రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ వేయిస్తా మన్న తమిళనాడు సీఎం


ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ చాలా వాగ్దానాలు వెలువడుచున్నాయి. రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ వేయిస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. దేశంలో ఇలాంటి ప్రకటన చేసిన తొలి సీఎంగా నిలిచారు. బిహార్‌ ప్రజలందరికీ కొవిడ్ వ్యాక్సిన్ ఉచితంగా వేయిస్తామని బీజేపీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన గంటల వ్యవధిలోనే తమిళనాడు ముఖ్యమంత్రి కూడా అదే తరహా ప్రకటన చేయడం గమనార్హం. అయితే తమిళనాడులోనూ త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. కొవిడ్ టీకా వ‌చ్చిన వెంటనే దాన్ని రాష్ట్ర ప్రజ‌లందరికీ ఉచితంగా వేయిస్తాం అని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి పేర్కొన్నారు.

రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి అడ్డు కట్ట వేయడానికి ముఖ్యంగా వాక్సిన్ అవసరమవుతుంది. ఇందుకోసం అయన గురువారం, అక్టోబర్ 22 సాయంత్రం ఈ ప్రకటన చేశారు. వ‌చ్చే ఏడాది ఆరంభంలో త‌మిళ‌నాడులో అసెంబ్లీ ఎన్నిక‌లు జరుగనున్నాయి. మరోవైపు ఫ్రీ కరోనా వ్యాక్సిన్‌పై విపక్షాలు విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. ఎన్నికలు వస్తున్నాయనగానే ఓటర్లను ఆకర్షించుకోవడానికి ఇలాంటి ప్రకటనలు చేస్తారని విమర్శిస్తున్నారు. ఓటు వేస్తే టీకా ఇస్తారా అంటూ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ కరోనా వ్యాక్సిన్ ఫ్రీ అంటూ రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. దీనిపై ప్రతిపక్ష పార్టీల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది.

Tags :
|

Advertisement