Advertisement

  • ఏపీలో ఆ రోజునుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణి ప్రారంభం

ఏపీలో ఆ రోజునుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణి ప్రారంభం

By: Sankar Wed, 16 Dec 2020 11:38 AM

ఏపీలో ఆ రోజునుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణి ప్రారంభం


దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మెల్ల మెల్లగా తగ్గుముఖం పడుతున్నాయి..రోజుకి ఇరవై వేలకు దగ్గర్లోనే పాజిటివ్ కేసులు నమోదు అయితున్నాయి ..ఇక ఏపీలో కూడా కరోనా చాల వరకు తగ్గుముఖం పట్టింది ..ఇంతకుముందు రోజుకి పదివేల ఆక పాజిటివ్ కేసులు నమోదు అయ్యేవీ కానీ ఇప్పుడు రోజుకి అయిదు వందలకు దగ్గర్లోనే నమోదు అయితున్నాయ్..

ఇక మరోవైపు కరోనా వ్యాక్సిన్ పంపిణీకి కూడా దేశంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి...అన్ని రాష్ట్రాలు టీకా పంపిణీకి సిద్ధంగా ఉండాలని ఇప్పటికే కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ సమయంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. డిసెంబరు 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికి కరోనా వ్యాక్సిన్లు ఇచ్చే బృహత్ కార్యక్రమం ప్రారంభం కానుంది.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి ఆదేశాల మేరకు 4762 ఆరోగ్య కేంద్రాల్లో వాక్సినేషన్ జరుగుతుంది. కోటికి పైగా టెస్టులు నిర్వహించి వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో రాష్ట్రం విజయం సాధించింది." అని ట్వీట్ చేశారు. డిసెంబర్ 25 నుంచి వ్యాక్సిన్ పంపిణి చేపట్టబోతుండటంతో ఏపీ ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Tags :
|

Advertisement