Advertisement

  • ప్రపంచంలో మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ పంపిణీ మొదలు

ప్రపంచంలో మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ పంపిణీ మొదలు

By: Sankar Tue, 08 Dec 2020 3:31 PM

ప్రపంచంలో మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ పంపిణీ మొదలు


కరోనా మహమ్మారి మొదలయి దాదాపు ఏడాది కావొస్తుంది ....ఈ ఏడాదిలో ప్రపంచంలో ఎన్నో దేశాలు కరోనా మహమ్మారి దెబ్బకు కకావికలం అయ్యాయి ...అయితే ఒకవైపు మహమ్మారి విజురంబిస్తున్నప్పటికీ మరోవైపు దేశాలు కరోనా వాక్సిన్ ను కనిపెట్టే పనిలో నిమగ్నమయినాయి..

అయితే తాజాగా ప్రపంచంలోనే మొట్టమొదటి సరిగా యూకేలో ఫైజర్‌ టీకా పంపిణీ ప్రారంభమైంది. అక్కడ ఈ ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ఈ పంపిణీ మొదలు పెట్టారు. సెంట్రల్ ఇంగ్లాండ్‌లోని కోవెంట్రీలోని యూనివర్శిటీ హాస్పిటల్‌లో 90ఏళ్ల మార్గరెట్‌ కీనన్‌ తొలి టీకా‌ వేయించుకున్నారు. ఫైజర్‌ టీకాకు క్లినికల్‌ అనుమతి లభించిన తర్వాత అధికారికంగా‌ తీసుకున్న తొలి వ్యక్తి ఆమెనే.

జర్మనీకి చెందిన బయో ఎన్‌టెక్‌ తో కలిసి ఫైజర్‌ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి యూకే ప్రభుత్వం ఇటీవల అనుమతించిన నేపధ్యంలో ఈ టీకా పంపిణీ మొదలుపెట్టారు. తొలి ప్రాధాన్యంగా కరోనా ప్రమాదం పొంచి ఉన్న ఆరోగ్య సిబ్బందికి, 80 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులతో పాటు కేర్‌ హోంలో ఉండే వర్కర్లకు దీనిని ఇస్తున్నారు

Tags :
|

Advertisement