Advertisement

  • నిమ్స్ లో రెండో దశకు చేరుకున్న కరోనా హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్

నిమ్స్ లో రెండో దశకు చేరుకున్న కరోనా హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్

By: Sankar Wed, 09 Sept 2020 10:32 AM

నిమ్స్ లో రెండో దశకు చేరుకున్న కరోనా హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్


నిమ్స్‌లో కొనసాగుతున్న కోవాగ్జిన్‌ హ్యూమన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగంగా రెండో దశ టీకా ప్రయోగం మొదలైంది. కోవిడ్‌–19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు దేశంలోనే ఫార్మా దిగ్గజమైన భారత్‌ బయోటెక్‌ ఫార్మాసూటికల్‌ సంస్థ తయారు చేస్తున్న కోవాగ్జిన్‌ టీకా ప్రయోగానికి దేశంలోని 12 ఆస్పత్రులను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

అందులో నిమ్స్‌ ఆస్పత్రి కూడా ఒకటి కావడం విదితమే. ఆయా ఆస్పత్రిలన్నీ క్లినికల్‌ ట్రయల్స్‌ మొదటి దశను విజయవంతం చేశాయి. టీకా తీసుకున్న వలంటీర్లంతా ఆరోగ్యంగానే ఉన్నారు. ఈ క్రమంలో రెండో దశ ట్రయల్స్‌లో దేశవ్యాప్తంగా 380 మందికి టీకా ప్రయోగం చేయనున్నారు. ఈ క్రమంలో మంగళవారం రెండో దశ టీకాలు వేయడం ఆరంభించారు..

మరోవైపు ఆక్స్‌ఫర్డ్, ఆస్ట్రాజెనెకా ఫార్మా సంయుక్తంగా తయారు చేసిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ట్రయల్స్‌ను నిలిపివేశారు. మూడో దశ ట్రయల్స్‌లో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వికటించింది. మూడవ దశ ట్రయల్స్‌లో భాగంగా వ్యాక్సిన్‌ను బ్రిటన్ వాసిపై ప్రయోగించగా, తీవ్రమైన సెడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన ఆక్స్‌ఫర్డ్ మూడో దశ ట్రయల్స్‌ను నిలిపివేసింది...

Tags :
|

Advertisement