Advertisement

  • కొత్త సంవత్సరంలోనే కరోనా వాక్సిన్ అందుబాటులోకి...

కొత్త సంవత్సరంలోనే కరోనా వాక్సిన్ అందుబాటులోకి...

By: chandrasekar Tue, 20 Oct 2020 09:37 AM

కొత్త సంవత్సరంలోనే  కరోనా వాక్సిన్ అందుబాటులోకి...


కొత్త సంవత్సరంలోనే కరోనా వాక్సిన్ అందుబాటులోకి రానున్నట్లు బ్రిటన్ అధికారులు తెలిపారు. బ్రిటన్‌లో కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ కొత్త సంవత్సరంలోనే అందుబాటులోకి వస్తుందని ఆ దేశ సీనియర్‌ మెడికల్‌ చీఫ్‌ వెల్లడించారు. ఇంగ్లాండ్ డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్, కరోనావైరస్ మహమ్మారిపై ప్రభుత్వ సలహాదారులలో ఒకరైన జోనాథన్ వాన్‌టామ్‌, పార్లమెంటు సభ్యులకు (ఎంపీ) ఈ విషయం చెప్పినట్లు వార్తాకథనాలు వచ్చాయి.

ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ లో వున్న ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ, ఆస్ట్రాజెనెకా కలిసి అభివృద్ధి చేసిన కొవిడ్‌ వ్యాక్సిన్‌ క్రిస్మస్‌ తర్వాత పంపిణీకి సిద్ధమవుతుందని ఆయన స్పష్టంచేశారు. ఇండియాలో ఈ టీకాను పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) తయారుచేస్తోంది. వ్యాక్సిన్‌ వస్తే హాస్పిటల్ లో చేరేవారి సంఖ్య తగ్గుతుందని, కొవిడ్‌ మరణాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని వాన్‌టామ్‌ పేర్కొన్నారు.

ఇందువల్ల వృద్ధులు, వ్యాధికి గురయ్యే అవకాశమున్నవారిని కాపాడవచ్చన్నారు. ఇదిలా ఉండగా, యూకే శుక్రవారం కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఇది పెద్ద సంఖ్యలో ఆరోగ్య కార్యకర్తలకు ఫ్లూ, మరియు సంభావ్య కొవిడ్‌-19 వ్యాక్సిన్లను అందించడానికి వీలు కల్పిస్తుంది. వాక్సిన్ అందుబాటులోకి వస్తేనే కరోనా వైరస్ ను కట్టడి చేయవచ్చని తెలిపారు.

Tags :
|

Advertisement