Advertisement

ఏపీలో కరోనా వ్యాక్సినేషన్ డ్రై రన్

By: Sankar Tue, 29 Dec 2020 1:23 PM

ఏపీలో కరోనా వ్యాక్సినేషన్ డ్రై రన్


దేశంలో కరోనా టీకా పంపిణీకి అధికార యంత్రాంగం సిద్ధమవుతున్నది. ఇందులో భాగంగా డమ్మీ వ్యాక్సినేషన్‌ (డ్రైరన్‌)ను నాలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాక్సిన్‌ డ్రైరన్‌ను అధికారులు ప్రారంభించారు. కృష్ణా జిల్లాలోని విజయవాడ ప్రభుత్వ దవాఖాన, సూర్యారావుపేటలోని పూర్ణ హార్ట్‌ సెంటర్‌, కృష్ణవేణి డిగ్రీకాలేజీ, తాడిగడప సెక్రటేరియట్‌, ప్రకాశ్‌నగర్‌ పీహెచ్‌సీ, కంకిపాడు మండలంలోని ఉప్పలూరు పీహెచ్‌సీ పరిధిలో ఈ డ్రైరన్‌ను రెండు రోజులపాటు నిర్వహించనున్నారు.

డ్రైరన్‌లో భాగంగా టీకా కార్యక్రమ యాప్‌ పనితీరు, వ్యాక్సిన్‌ సరఫరా, పంపిణీలో ఎదురయ్యే ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకోనున్నారు. దీనిద్వారా కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో ఎలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.

కాగా ఏపీలో కొత్త వేరియంట్‌ వైరస్‌ను కనుగొన్నారు. కొత్తరకం వైరస్‌కు ఎన్440కేగా నామకరణం చేశారు. ఈ వైరస్‌ ఆంధ్రప్రదేశ్‌లో శరవేగంగా విస్తరిస్తున్నదని ఈ పరిశోధనల్లో తేలింది. ఈ కొత్త కరోనా రకానికి యాంటీబాడీస్‌ నుంచి తప్పించుకునే లక్షణం ఉన్నట్లు గుర్తించారు. కరోనా వచ్చినవారిలో మూడింట ఒక వంతు మందికి ఈ రంకం ఉన్నట్లు తేల్చారు..

Tags :
|
|

Advertisement