Advertisement

  • ఇంగ్లాండ్‌తో సిరీస్ ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టులో కరోనా కలవరం....

ఇంగ్లాండ్‌తో సిరీస్ ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టులో కరోనా కలవరం....

By: chandrasekar Sat, 21 Nov 2020 12:50 PM

ఇంగ్లాండ్‌తో సిరీస్ ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టులో కరోనా కలవరం....


నవంబరు 27 నుంచి ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా మధ్య మూడు టీ20ల సిరీస్ ప్రారంభంకానుండగా ఆ తర్వాత మూడు వన్డేల సిరీస్‌ కూడా జరగనుంది. ఈ నేపథ్యంలో.. ఇప్పటికే దక్షిణాఫ్రికా గడ్డపైకి చేరుకున్న ఇంగ్లాండ్ టీమ్.. కరోనా వైరస్ పరీక్షలు చేయించుకుని ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేసింది. మరోవైపు ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టులో ఇటీవల ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదవగా శుక్రవారం మరో కేసు నమోదైనట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు స్వయంగా ప్రకటించింది. అయితే ఆ ఇద్దరు క్రికెటర్ల పేర్లని మాత్రం బోర్డు గోప్యంగా ఉంచింది.

కరోనా వైరస్ బారినపడిన ఆటగాళ్లతో దక్షిణాఫ్రికా టీమ్ మేనేజ్‌మెంట్‌ రెగ్యులర్ టచ్‌లో ఉందని చెప్పుకొచ్చిన ఆ దేశ క్రికెట్ బోర్డు ఆటగాళ్లు ధైర్యంగా ఉన్నారని ఆ ప్రకటనలో తెలిపింది. ఇక సిరీస్‌లో పారదర్శకత కోసమే కరోనా వైరస్ కేసుల విషయాన్ని వెల్లడిస్తున్నట్లు చెప్పుకొచ్చిన దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రత్యర్థి ఇంగ్లాండ్ టీమ్‌తోనూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు వివరించింది.

కరోనా వైరస్ కేసుల నేపథ్యంలో.. శనివారం దక్షిణాఫ్రికా టీమ్‌లోని ఆటగాళ్ల మధ్య జరగాల్సిన ప్రాక్టీస్ మ్యాచ్ రద్దయింది. సిరీస్ ఆరంభానికి ఇక వారం రోజులే సమయం ఉండగా టీమ్‌లోని ఆటగాళ్ల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు దక్షిణాఫ్రికా మెడికల్ టీమ్ సమీక్షిస్తున్నట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు పేర్కొంది. కరోనా వైరస్ బారిన పడిన ఆటగాళ్లని ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు కూడా బోర్డు తెలియ చేసింది.

Tags :
|

Advertisement