Advertisement

  • బ్రెజిల్ లో కరోనా ట్రయిల్ వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్ ఒకరు కన్నుమూత

బ్రెజిల్ లో కరోనా ట్రయిల్ వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్ ఒకరు కన్నుమూత

By: Sankar Thu, 22 Oct 2020 09:01 AM

బ్రెజిల్ లో కరోనా ట్రయిల్ వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్ ఒకరు కన్నుమూత


ప్రపంచంలో కోవిడ్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కరోనా కేసులతో పాటు రికవరీ కేసులు పెరుగుతున్నా, మహమ్మారిని పూర్తిగా అరికట్టాలి అంటే తప్పనిసరిగా వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలి.

ప్రస్తుతం అనేక దేశాలు వ్యాక్సిన్ తయారీలో బిజీగా ఉన్నాయి. స్వీడన్ కు చెందిన అస్త్రాజెనాక-ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం కలిసి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ కు సంబంధించిన ట్రయల్స్ ను వివిధ దేశాల్లో నిర్వహిస్తున్నారు. బ్రెజిల్ లో కూడా ఈ ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం డెవలప్ చేస్తున్న టీకాకు సంబంధించి మూడో దశ ట్రయల్స్ జరుగుతున్నాయి.

అయితే, ట్రయల్స్ లో భాగంగా టీకా తీసుకున్న ఓ వాలంటీర్ మరణించినట్టు బ్రెజిల్ వర్గాలు ప్రకటించాయి. టీకా వలన వాలంటీర్ మరణించాడా లేదా మరేదైనా కారణాలు ఉన్నాయా అనే విషయంపై ప్రస్తుతం బ్రెజిల్ ఆరోగ్యశాఖ దర్యాప్తు చేస్తున్నది.

Tags :
|
|

Advertisement