Advertisement

స్టార్ హీరోకు కరోనా....

By: chandrasekar Wed, 09 Dec 2020 3:08 PM

స్టార్ హీరోకు కరోనా....


సినిమా ఇండస్ట్రీలో చాలా మంది కరోనా వైరస్ బారిన పడి కన్ను మూసారు. నిన్నటికి నిన్న బాలీవుడ్ నటి దివ్య భట్నాగర్ కేవలం 34 ఏళ్ల వయసులో ఈ వైరస్ కారణంగా తనువు చాలించింది. ప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కూడా కరోనా కారణంగా మరణించాడు. తాజాగా మరో సినీ యాక్టర్ వైరస్ బారిన పడ్డాడు. తమిళ స్టార్ హీరో శరత్ కుమార్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆయన భార్య రాధిక ట్వీట్ చేసింది. ఈ రోజు శరత్ కుమార్ హైదరాబాద్ లో టెస్ట్ చేస్తే ఈయనకు పాజిటివ్ అని వచ్చింది అయితే ఎలాంటి లక్షణాలు లేని కారణంగా ఎవరూ భయపడాల్సిన అవసరం లేదంటూ రాధిక ట్వీట్ చేసారు.

శరత్ ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు పూర్తి సమాచారం సోషల్ మీడియాలో తాను అభిమానులకు తెలియజేస్తానని పేర్కొంది. వైద్యుల సలహా మేరకు 14 రోజులు ఇంట్లో ఉంటే సరిపోతుందని ఎవరూ దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్పారు. ప్రస్తుతానికి ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదు. అంతేకాదు పాజిటివ్ వచ్చినా కూడా డాక్టర్లు దగ్గరుండి చూసుకుంటున్నారు అని అన్నారు రాధికా.

Tags :
|
|
|
|

Advertisement