Advertisement

శ్రీశైలంలో సెక్యూరిటీ గార్డుకి కరోనా

By: chandrasekar Wed, 08 July 2020 2:38 PM

శ్రీశైలంలో సెక్యూరిటీ గార్డుకి కరోనా


శ్రీశైలంతో పాటు సునిపెంట గ్రామంలో మొదటిసారి రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వారిలో ఒకరు శ్రీశైలం ఆలయానికి సెక్యూరిటీ గార్డు కాగా మరొకరిని సునిపెంట తండాలో గుర్తించారు. వెంటనే వారిని కర్నూలు క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించారు.

ఆలయంలో పాజిటివ్‌ వచ్చిన సెక్యూరిటీ గార్డుతో ప్రాథమిక కాంటాక్టులో ఉన్న ఆలయ భద్రతా సిబ్బందిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మొదటిసారి శ్రీశైలం ఆలయంలో పాజిటివ్‌ కేసు రావడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల, శ్రీకాలహస్తి, కాణిపాకం వంటి ప్రధాన తీర్థ యాత్రల్లో కరోనావైరస్ కేసులు ఇప్పటికే నమోదు కాగా శ్రీశైలంలో మాత్రం ఇదే మొదటి కేసు. తిరుమల టీటీడీ సిబ్బందికి వైరస్ సోకగా శ్రీకాలహస్తిలో పూజారికి వైరస్ సోకింది. దీంతో ఆ సమయంలో అధికారులు అప్రమత్తమై దర్శనాలను నిలిపివేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో కూడా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా మంగళవారం అక్కడ 24 గంటల్లో 1,178 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు జిల్లాలో 85 మంది కరోనాతో మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 21,197కు చేరింది. ఇందులో కర్నూలు జిల్లాలో 2,671 కేసులు నమోదు కాగా అందులో 1,318 మంది కరోనా బారి నుంచి బయటపడి డిశ్చార్జి అయ్యారు.

Tags :
|
|

Advertisement