Advertisement

  • బురుజు ప్రసూతి ఆస్పత్రిలో 32 మంది వైద్య సిబ్బందికి కరోనా

బురుజు ప్రసూతి ఆస్పత్రిలో 32 మంది వైద్య సిబ్బందికి కరోనా

By: chandrasekar Tue, 16 June 2020 5:59 PM

బురుజు ప్రసూతి ఆస్పత్రిలో 32 మంది వైద్య సిబ్బందికి కరోనా


కరోనా పోరాటంలో ముందు వరుసలో ఉండే పోలీసు, వైద్య సిబ్బందిలో వైరస్‌ వ్యాప్తి కలకలం రేపుతోంది. సోమవారం జరిపిన పరీక్షల్లో పేట్ల బురుజు ప్రసూతి ఆస్పత్రిలో 32 మంది వైద్య సిబ్బందికి వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు తెలిసింది. వారిలో 18 మంది వైద్యులు, 14 మంది సిబ్బంది ఉన్నారు. కాగా, పూర్తిస్థాయి జాగ్రత్తలు, పీపీఈ కిట్లు ధరించినప్పటికీ వైద్య సిబ్బందికి కరోనా సోకవడం ఆందోళన కలిగిస్తోంది.

రాష్టంలో రోజురోజుకి కరోనా ప్రభావం ఎక్కువవుతూనే ఉంది. ప్రజలు భయాందోళనలు గురి అవుతున్నారు. ఇప్పటికే ఉస్మానియా వైద్య కళాశాల అనుబంధ ఆస్పత్రులతో పాటు, నిమ్స్‌, కింగ్‌ కోఠి, గాంధీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పదుల సంఖ్యలో వైద్య సిబ్బంది వైరస్‌ బారినపడిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రభుత్వ యంత్రాంగంలో కీలకంగా వ్యవహరించే ప్రజా ప్రతినిధులూ కోవిడ్‌ బారినపడుతున్నారు. జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిగిరి రెడ్డి, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్తాకు పాజిటివ్‌గా తేలింది.


Tags :
|
|

Advertisement