Advertisement

సారా అలీ ఖాన్ డ్రైవ‌ర్‌కి క‌రోనా

By: chandrasekar Wed, 15 July 2020 3:26 PM

సారా అలీ ఖాన్ డ్రైవ‌ర్‌కి క‌రోనా


చిన్న‌, పెద్ద‌, ధ‌నిక‌, పేద అనే తేడా లేకుండా ప్ర‌తి ఒక్క‌రు క‌రోనా బారిన ప‌డుతున్నారు. ఇక బాలీవుడ్ ఇండ‌స్ట్రీలో సెల‌బ్రిటీల‌కి లేదంటే వారి సిబ్బందికి క‌రోనా సోకుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తుంది. తాజాగా సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్ త‌న‌ డ్రైవ‌ర్‌కి క‌రోనా సోకింద‌నే విష‌యాన్ని త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియ‌జేసింది.

సారా డ్రైవర్‌కి క‌రోనా అని తెలిసిన వెంట‌నే ఈ విష‌యాన్ని ముంబై కార్పొరేష‌న్ అధికారుల‌కు తెలియ‌జేశారు. డ్రైవ‌ర్‌ని క్వారంటైన్‌ని త‌ర‌లించిన బీఎంసీ సారా ఫ్యామిలీ అంద‌రికి క‌రోనా ప‌రీక్ష‌లు జ‌రిపారు.

సారా, ఆమె త‌ల్లి అమ్రితా సింగ్‌, సోద‌రుడు ఇబ్ర‌హీం అలీ ఖాన్‌కి నెగెటివ్ రిపోర్ట్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం వారు హోమ్ క్వారంటైన్‌లో ఉంటూ త‌గిన జాగ్ర‌త్తలు తీసుకుంటున్నారు. ఆ మ‌ధ్య బోని, అమీర్, రేఖ‌ సిబ్బందికి కూడా క‌రోనా సోకిన విష‌యం తెలిసిందే.

Tags :
|
|

Advertisement