Advertisement

పరుగుల వీరుడు ఉస్సేన్ బోల్ట్ కు కరోనా

By: chandrasekar Tue, 25 Aug 2020 09:12 AM

పరుగుల వీరుడు  ఉస్సేన్ బోల్ట్ కు కరోనా


కరోనా ఎవ్వరిని వదలి పెట్టడంలేదు. పేద, ధనవంతుడని తేడా లేకుండా అందరికి వ్యాపిస్తా వుంది. ప్రపంచ ప్రఖ్యాత అథ్లెట్ పరుగుల వీరుడు ఉస్సేన్ బోల్ట్ కు కరోనా వైరస్ సోకింది. ఎక్కు వసార్లు (8 సార్లు) ఒలింపిక్ బంగారు పతకాన్ని సాధించిన ఉస్సేన్ బోల్ట్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు.

వరల్డ్ రికార్డులు సృష్టించిన ఇతను ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నానని లక్షణాలు మాత్రం లేవని బోల్ట్ వెల్లడించాడు. ప్రోటోకాల్ ప్రకారం తనను తాను నియంత్రించుకుంటున్నానని అన్నాడు. అందరూ క్షేమంగా, సురక్షితంగా ఉండాలని కోరాడు. ట్వీట్ చేయడమే కాకుండా ఓ వీడియో కూడా ట్యాగ్ చేశాడు. భూమి మీదే అత్యంత వేగంగా పరుగెత్తే అథ్లెట్ గా ఉన్న ఉస్సేన్ బోల్ట్ ఈ మధ్యనే ఆగస్టు 21న తన 34 వ బర్త్ డే జరుపుకున్నాడు.

ఆఫ్రికా లోని జమైకా కు చెందిన ఉస్సేన్ బోల్ట్ బర్త్ డే పార్టీలో ఇంగ్లండ్, మాంచెస్టర్ సిటీ ఫార్వార్డ్ ఆటగాడు రహీమ్ స్టెర్లింగ్, వెస్ట్ ఇండీస్ బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్, బేయర్ లెవర్ కుసెన్ తదితరులు హజరయ్యారు. ఏ మాత్రం సోషల్ డిస్టెన్స్ పాటించకుండా బర్త్ డే పార్టీకు హాజరైనవారంతా వేడుక జరుపుకున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ పార్టీకి హాజరైన వారు కరోనాకు గురైనట్లు ఏవివరాలు అందలేదు.

Tags :
|
|
|

Advertisement