Advertisement

హర్షవర్ధన్‌ రాణేకు కరోనా

By: chandrasekar Wed, 07 Oct 2020 4:22 PM

హర్షవర్ధన్‌ రాణేకు కరోనా


నటుడు హర్షవర్ధన్‌ రాణేకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. దీనీవల్ల ఆయన సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్‌ ద్వారా ధ్రువీకరించారు. జ్వరం, కడుపు నొప్పి ఉండగా హాస్పిటల్ కు వెళ్లి కరోనా‌ పరీక్షలు చేయగా పాజిటివ్‌గా తేలిందని తెలిపారు. దీంతో సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. పుల్కిత్ సామ్రాట్, కృతి కర్బందా, జిమ్ సర్బ్‌తో కలిసి తైష్‌’ చిత్రంలో రాణే నటించారు. రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం జీ5 యాప్‌లో అక్టోబర్ 29న విడుదలకానుంది.

హర్షవర్ధన్‌ బాలీవుడ్‌తో పాటు తెలుగులో పలు చిత్రాల్లో నటించారు. తకిట తకిట, నా ఇష్టం, అవును, ప్రేమ ఇష్క్‌ కాదల్‌, అనామిక, మాయా, బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళి, అవును-2, బెంగాల్‌ టైగర్‌తో పాటు పలు చిత్రాల్లో నటించారు. ఇదిలా ఉండగా.. సోమవారం నాటికి ముంబైలో 2,15,465 చేరాయి. ఒకే రోజు 1,813 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. గడిచిన ఐదు రోజుల్లో అత్యల్పంగా కేసులు నిర్ధారణ అయ్యాయి. కొత్తగా వైరస్‌తో 47 మంది మృతి చెందగా మహానగరంలో మరణాలు 9,152కు చేరాయి.

Tags :
|
|
|

Advertisement