Advertisement

ఫార్ములా వ‌న్ వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ కు క‌రోనా...

By: chandrasekar Tue, 01 Dec 2020 7:33 PM

ఫార్ములా వ‌న్ వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ కు క‌రోనా...


ఫార్ములా వ‌న్ వ‌రల్డ్ చాంపియ‌న్ లూయిస్ హామిల్ట‌న్ క‌రోనా బారిన ప‌డ్డాడు. ఏడుసార్లు ఎఫ్ 1 చాంపియ‌న్‌గా నిలిచి చ‌రిత్ర సృష్టించిన హామిల్ట‌న్‌ సాఖిర్ గ్రాండ్ ప్రికి దూర‌మ‌వుతున్న‌ట్లు మెర్సెడీజ్‌-ఏఎంజీ పెట్రొనాస్ ఎఫ్‌1 టీమ్ పేర్కొంది. గ‌త వారంలో హామిల్ట‌న్‌కు మూడుసార్లు ప‌రీక్ష‌లు నిర్వ‌హించినా ప్ర‌తిసారీ నెగ‌టివ్ రిపోర్ట్ వ‌చ్చిన‌ట్లు టీమ్ తెలిపింది. ఆదివారం బ‌హ్రెయిన్ గ్రాండ్ ప్రి కూడా గెలిచాడు.

అయితే సోమ‌వారం ఉద‌య‌మే అత‌నికి క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించాయ‌ని టీమ్ పేర్కొంది. ఆ త‌ర్వాత టెస్ట్ చేస్తే కరోనా పాజిటివ్‌గా తేలిన‌ట్లు ప్రకటించింది. ప్ర‌స్తుతం బ‌హ్రెయిన్‌లో ఉన్న హామిల్ట‌న్‌.. అక్క‌డి నిబంధ‌న‌ల మేర‌కు ఐసోలేష‌న్‌లో ఉన్నాడు. స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు మిన‌హాయించి అత‌డు ఫిట్‌గా ఉన్న‌ట్లు టీమ్ ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

Tags :
|
|
|

Advertisement