Advertisement

  • 2 నెలల బాబుతో పాటు చిరంజీవి సర్జా ఫ్యామిలీకి కరోనా...

2 నెలల బాబుతో పాటు చిరంజీవి సర్జా ఫ్యామిలీకి కరోనా...

By: chandrasekar Tue, 08 Dec 2020 11:53 PM

2 నెలల బాబుతో పాటు చిరంజీవి సర్జా ఫ్యామిలీకి కరోనా...


కన్నడ దివంగత హీరో చిరంజీవి సర్జా భార్య, నటి మేఘనా రాజ్ సోషల్‌మీడియా ద్వారా తమ కుటుంబం మొత్తం కరోనా బారిన పడిందని తెలిపారు. తాను, బాబు, అమ్మానాన్నలు కరోనా బారిన పడినట్లు ప్రకటించారు. ‘హలో మా అమ్మా నాన్న, నాకు, నా కుమారుడికి కరోనా‌ పాజిటివ్‌ నమోదయింది. దీంతో కొన్ని వారాలుగా మమ్మల్ని కలిసిన వారు కూడా పరీక్షలు నిర్వహించుకోవాలని కోరుతున్నాం. చిరు అభిమానులకు ఓ విజ్ఞప్తి.. జూనియర్‌ చిరు ఆరోగ్యంగానే ఉన్నాడు. నేనెప్పుడూ తనతోనే ఉంటున్నా’ అంటూ మేఘనారాజ్‌ పోస్ట్‌లో తెలిపారు.

మహమ్మారిపై యుద్ధంలో మా కుటుంబం గెలుస్తుంది. వైరస్‌ను జయిస్తాం అని మేఘన తెలిపారు. దక్షిణాదిలో సీనియర్‌ హీరో అర్జున్‌ మేనల్లుడైన చిరంజీవి సర్జా అనేక సినిమాల్లో హీరోగా నటించారు. గతేడాది జూన్ 7వ తేదీన గుండెపోటు రావడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. అప్పటికే చిరు భార్య మేఘనారాజ్ గర్భవతిగా ఉన్నారు. భర్త ఫోటో పెట్టుకుని సీమంతం జరుపుకున్నారు. ఆ ఫోటోలు వైరల్‌గా మారాయి. ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చారు.

Tags :
|

Advertisement