Advertisement

  • ఢిల్లీ లో కరోనా మూడో వేవ్ మొదలయింది ..ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌

ఢిల్లీ లో కరోనా మూడో వేవ్ మొదలయింది ..ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌

By: Sankar Wed, 11 Nov 2020 2:38 PM

ఢిల్లీ లో కరోనా మూడో వేవ్ మొదలయింది ..ఆరోగ్య మంత్రి  సత్యేంద్ర జైన్‌


ఢిల్లీలో మూడో వేవ్‌ మొదలైందనడంలో ఎలాంటి సందేహం లేదని ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌ అన్నారు. ప్రస్తుతం టెస్ట్‌ల సంఖ్యను మూడు రెట్లు పెంచామని ఆయన తెలిపారు. త్వరలో కేసుల సంఖ్య తగ్గుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. గడిచిన 24 గంట్లలో ఢిల్లీలో 17వేల టెస్ట్‌లు చేశామని, టెస్ట్‌ల సంఖ్యను పెంచుతామని స్పష్టం చేశారు..

కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లోని ఐసీయూలో బెడ్ల సంఖ్యను పెంచాలని ఆ మధ్యనే ఆదేశాలు జారీ చేశామని, కానీ ఢిల్లీ హైకోర్టు స్టే విధించిందని తెలిపారు. దీనిపై సుప్రీం కోర్టు తమకు అనుకూల తీర్పు ఇస్తుందని భావిస్తున్నట్లు సత్యేంద్ర జైన్ అన్నారు. కాగా ఢిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 4,51,382కు చేరింది..

కాగా కరోనా నేపథ్యంలో ఢిల్లీ వ్యాప్తంగా టపాసులు పేల్చడం నిషేధించడం ఉందని, టపాసులను పేల్చడమే కాకుండా ఎవరైనా విక్రయించేందుకు ప్రయత్నించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టపాసులు విక్రయించుకోవడం కోసం ఇప్పటివరకు జారీ చేసిన లైసెన్సులన్నింటినీ కూడా రద్దు చేసినట్లు ప్రకటించారు. నవంబరు 30 వరకు ఈ నిషేధం అమలవుతుందని తెలిపారు...

Tags :
|
|

Advertisement