Advertisement

ఏపీని భయపెడుతున్న కరోనా

By: chandrasekar Tue, 02 June 2020 1:33 PM

ఏపీని భయపెడుతున్న కరోనా


ఆంధ్ర రాష్ట్రం లో కొత్తగా 105 కేసులు, మరో ఇద్దరు మృతి ఏపీని కరోనా టెన్షన్ వెంటాడుతోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. లోకల్ కాంటాక్ట్, విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా వైరస్ వ్యాపిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 10,567 శాంపిల్స్‌ను పరీక్షించగా 76 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు మీడియా బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇతర కేసులు 31 ఉన్నాయి. కొద్దిరోజులుగా జిల్లాల వారీగా కేసుల వివరాలను ప్రభుత్వం తెలియజేయలేదు. తాజా కేసులు కలిపితే మొత్తం సంఖ్య 3118కు చేరాయి. మరో 34 మంది వైరస్ నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 885కు చేరింది.

ఏపీ లో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 650పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తర్వాత గుంటూరు జిల్లాలో 400కు పైగా కేసులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 2169మందికి నెగిటివ్ రావడంతో వారిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు.

corona,that,scares,andhra,pradesh ,ఏపీని, భయపెడుతున్న, కరోనా, ఆంధ్ర రాష్ట్రం, పాజిటివ్


రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో మొత్తం 64మంది చనిపోయారు. గత 24 గంటల్లో కోవిడ్ వల్ల ఇద్దరు కన్నుమూశారు. తాజాగా నమోదవుతున్న కరోనా కేసుల్లో చిత్తూరు, నెల్లూరు జిల్లాలతో పాటూ మరికొన్ని జిల్లాల్లో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ కోయంబేడు మార్కెట్ లింకులు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే విదేశాల నుంచి వచ్చిన వారిలో కూడా కొన్ని కేసులు ఉన్నాయి.

రాష్ట్రంలో కొత్త నమోదైన పాజిటివ్ కేసుల్లో నెల్లూరు జిల్లాలో 8 కేసులు కోయంబేడు (తమిళనాడు) నుంచి వచ్చారని బులిటెన్‌లో తెలిపారు. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కమ్యులేటివ్ పాజిటివ్ కేసులు 446 వీటిలో యాక్టివ్ కేసులు 249 ఉన్నాయని ప్రకటించారు. అలాగే విదేశాల నుంచి వచ్చిన 112మందికి వైరస్ సోకినట్లు తెలియజేశారు.అయితే కోయంబేడు లింకులతో పాటూ విదేశాల నుంచి వచ్చిన వారితో కొత్త టెన్షన్ వెంటాడుతోంది.మొదలైయింది.

Tags :
|
|
|
|

Advertisement