Advertisement

  • తెలంగాణలో 36 లక్షలు దాటిన కరోనా పరీక్షలు...88.15 శాతానికి చేరుకున్న రికవరీ రేటు

తెలంగాణలో 36 లక్షలు దాటిన కరోనా పరీక్షలు...88.15 శాతానికి చేరుకున్న రికవరీ రేటు

By: chandrasekar Wed, 14 Oct 2020 4:28 PM

తెలంగాణలో 36 లక్షలు దాటిన కరోనా పరీక్షలు...88.15 శాతానికి చేరుకున్న రికవరీ రేటు


హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా బాధితుల రికవరీ రేటు రికార్డుస్థాయిలో 88% దాటింది. సోమవారం దేశంలో రికవరీ రేటు 86.8% ఉండగా, తెలంగాణలో 88.15 శాతానికి చేరుకున్నది.

మరోవైపు వైరస్‌ నిర్ధారణ పరీక్షల సంఖ్య 36 లక్షలకు పెరిగింది. ఇందులో 2.14 లక్షల మందికి పాజిటివ్‌గా తేలింది.

ఇప్పటివరకు 1.89 లక్షల మంది కోలుకోగా, 24,208 మంది ఇండ్లు, దవాఖానల్లో చికిత్సపొందుతున్నట్టు మంగళవారం విడుదలచేసిన బులెటిన్‌లో వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. సోమవారం 1,708 మందికి వైరస్‌ పాజిటివ్‌గా తేలింది.

జీహెచ్‌ఎంసీలో 277 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి 137, మేడ్చల్‌ మల్కాజిగిరి 124, భద్రాద్రి కొత్తగూడెం 97, కరీంనగర్‌ 86 కేసులు నమోదు అయ్యాయి.

Tags :

Advertisement