Advertisement

  • నాలాగా కరోనా బారిన పడకండి ..జాగ్రత్తగా ఉండండి ..కార్యకర్తలకు తెరాస ఎమ్మెల్యే సందేశం

నాలాగా కరోనా బారిన పడకండి ..జాగ్రత్తగా ఉండండి ..కార్యకర్తలకు తెరాస ఎమ్మెల్యే సందేశం

By: Sankar Wed, 24 June 2020 5:07 PM

నాలాగా కరోనా బారిన పడకండి ..జాగ్రత్తగా ఉండండి ..కార్యకర్తలకు తెరాస ఎమ్మెల్యే  సందేశం



కరోనా మహమ్మారికి తారతమ్యాలు లేకుండా అందరి మీద తన పంజా విసురుతుంది ..సాధారణంగా ఏవైనా వ్యాధులు అంటే అవి ఎక్కువగా పేద వారికీ మరియు పరిసరాలు సరిగా లేక అపరిశుభ్రంగా ఉన్న చోట మాత్రమే విస్తరిస్తాయి ..కానీ కరోనా అలా కాదు ప్రధానుల నుంచి అద్యక్షులదాకా , సీఎం ల నుంచి యంయల్యే ల దాకా క్రికెటర్ల నుంచి తెంన్సీ ఆటగాళ్ల దాకా ఇలా ప్రతి ఒక్కరి మీద తన ప్రభావాన్ని చూయించింది..ఇలాగె తెలంగాణాలో కూడా ప్రజా ప్రతినిధులు కరోనా బారిన పడ్డారు ..

ఇలా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ద్వారానే వైరస్‌ సోకినట్టు తెలుస్తోంది. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని తన నివాసంలోనే చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని, త్వరలోనే కరోనా నుంచి కోలుకొని నియోజకవర్గ ప్రజలను కలుస్తానని గణేష్‌ గుప్తా చెప్పారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ వాట్సప్‌ సందేశాన్ని విడుదల చేశారు.

నాపై ప్రేమ చూపిన ప్రజలకు, అభిమానులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు. నేను బాగానే ఉన్నాను. ఎవరూ అధైర్యపడొద్దు. త్వరలో నేను చేయించుకోబోయే టెస్ట్‌లో నెగెటివ్‌ వస్తుందని ఆశిస్తున్నాను. మీ ముందుకు త్వరలోనే వస్తాను. అందరు తప్పకుండా మాస్కులు ధరించండి. సామాజిక దూరం పాటించండి. అన్ని జాగ్రత్తలు తీసుకున్న నేనే కరోనా బారిన పడ్డాను. దయచేసి జాగ్రత్తగా ఉండండి. నిజామాబాద్‌ నగర ప్రజలు ఎవరూ కూడా నాలాగా కరోనా బారిన పడొద్దని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను’ అని గణేష్‌ గుప్తా ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.


Tags :
|

Advertisement