Advertisement

సల్మాన్ ఖాన్ కి కరోనా టెస్టులో నెగటివ్

By: chandrasekar Fri, 20 Nov 2020 11:07 AM

సల్మాన్ ఖాన్ కి కరోనా టెస్టులో నెగటివ్


బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్ ఖాన్ కి కరోనా పరీక్షలో నెగటివ్ గా తేలింది. తన వ్యక్తిగత డ్రైవరుతో పాటు మరో ఇద్దరు ఉద్యోగులకు కరోనా సోకడంతో బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ హోంక్వారంటైన్‌లోకి వెళ్లినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్ వ్యక్తిగత డ్రైవర్, ఇద్దరు సిబ్బందికి కరోనావైరస్ పాజిటివ్ అని పరీక్షల్లో తేలిన వెంటనే సల్మాన్ ఖాన్ తన ఫ్యామిలీతో కలిసి హోం క్వారంటైన్‌కి వెళుతున్నట్లుగా ప్రకటించారు.

ప్రస్తుతం కరోనా బారిన పడిన తన సిబ్బందిని సల్మాన్ ఖాన్ ముంబైలోని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఆ తర్వాత సల్మాన్‌ ఫ్యామిలీకి కరోనా పరీక్షలు జరపగా సల్మాన్‌తో పాటు, అతని ఫ్యామిలీ మెంబర్స్‌ అందరికీ నెగిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.

వీరి అందరికి ఎటువంటి లక్షణాలు లేకపోయినా ఫ్యామిలీ మాత్రం 14 రోజుల పాటు హోమ్‌ క్వారంటైన్‌లోనే ఉండాలని సల్మాన్‌ ఖాన్‌ ఫ్యామిలీ నిర్ణయం తీసుకుందట. ఇక సల్మాన్‌కి నిర్వహించిన టెస్టులో నెగిటివ్‌ అని తేలడంతో ఆయన అభిమానులు, అలాగే బాలీవుడ్‌ వర్గాలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైనట్లు వస్తున్న వార్తలవల్ల మరింత భయాందోళనకు గురిచేస్తుంది.

Tags :
|
|

Advertisement