Advertisement

గుజరాత్‌లో కరోనా పరీక్షలకు రూ. 2500లు

By: chandrasekar Fri, 26 June 2020 4:10 PM

గుజరాత్‌లో కరోనా పరీక్షలకు రూ. 2500లు


కరోనా పరీక్షల కోసం రాష్ట్రంలోని ప్రైవేటు ల్యాబ్స్ కు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలుసిందే. ప్రైవేటు ల్యాబ్స్‌లో కరోనా పరీక్షల కోసం వసూలు చేస్తున్న ధరలను గుజరాత్ ప్రభుత్వం తగ్గించింది. ఇప్పటివరకు కరోనా పరీక్షల కోసం రాష్ట్రంలోని ప్రైవేటు ల్యాబ్స్ రూ. 4000 వసూలు చేస్తున్నాయి. అయితే దీన్ని రూ. 2500కు తగ్గిస్తూ గుజరాత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని గుజరాత్ డిప్యూటీ సీఎం, ఆరోగ్యశాఖ మంత్రి నితిన్ పటేల్ తెలిపారు.

ఒకవేళ పేషెంట్లు ల్యాబ్‌కు వెళితే కరోనా పరీక్షకు రూ. 2500 చెల్లించాలని ల్యాబ్ అసిస్టెంట్ ఇంటికి వచ్చి శాంపిల్స్ తీసుకుంటే రూ. 3000 చెల్లించాలని కొత్త నిబంధనలు ఖరారు చేశారు. ప్రభుత్వం సూచించిన ధరల కంటే ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తే సదురు ల్యాబ్స్ లైసెన్స్‌లు రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. ప్రతి రోజూ దాదాపు 500 మంది కరోనా పరీక్షల కోసం ప్రైవేట్ ల్యాబ్స్‌కు వెళుతున్నారని మంత్రి నితిన్ పటేల్ తెలిపారు.

అయితే ప్రభుత్వ నిర్ణయంపై విపక్షం అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా పరీక్షల ధరను రూ. 1000కి తగ్గించాలని డిమాండ్ చేసింది. అంతకుముందు జూన్ 15న కాంగ్రెస్ ఎంపీ అహ్మద్ పటేల్ ఇదే అంశంపై గుజరాత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ముంబైలో 2200 తీసుకునే కరోనా టెస్టుకు అహ్మదాబాద్‌లో 4500 ఎందుకు చెల్లించాలని ప్రశ్నించారు. కాగా, దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల జాబితాలో గుజరాత్ కూడా ఉంది.

Tags :
|
|
|

Advertisement