Advertisement

  • పాక్ జట్టులో కరోనా కలకలం...ప్లేయర్లకు న్యూజిలాండ్ హెచ్చరిక...

పాక్ జట్టులో కరోనా కలకలం...ప్లేయర్లకు న్యూజిలాండ్ హెచ్చరిక...

By: chandrasekar Sat, 28 Nov 2020 6:14 PM

పాక్ జట్టులో కరోనా కలకలం...ప్లేయర్లకు న్యూజిలాండ్ హెచ్చరిక...


న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ జట్టులో మరొకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ జట్టులో మొత్తం కరోనా బాధితుల సంఖ్య ఏడుకు చేరింది. కరోనా నిబంధనలను పాటించడం లేదని ఇప్పటికే న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుతోపాటు ఆ దేశ ప్రభుత్వం పాకిస్థానీ క్రికెటర్లకు ఫైనల్ వార్నింగ్ ఇచ్చాయి. నవంబర్ 23న పాకిస్థాన్ నుంచి న్యూజిలాండ్ బయల్దేరి వెళ్లిన పాక్ జట్టు క్రైస్ట్ చర్చ‌లోని హోటల్లో క్వారంటైన్లో ఉంది. పాకిస్థాన్ నుంచి బయల్దేరే ముందే ఆటగాళ్లకు నాలుగుసార్లు కరోనా టెస్టులు చేసినప్పటికీ న్యూజిలాండ్ చేరాక క్రికెటర్లకు కరోనా ఉన్నట్లు తేలడం పాక్ టెస్టుల్లోని అసఫలితాన్ని బయటపెట్టింది.

పాక్ జట్టులోకి ఆరుగురు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం.. పాక్ ఆటగాళ్లు నిబంధనలను ఉల్లంఘిస్తుండటంతో పర్యాటక జట్టు శిక్షణ కోసం హోటల్ నుంచి బయటకు వెళ్లకుండా న్యూజిలాండ్ ఆంక్షలు విధించింది. 53 మందితో కూడిన పాక్ జట్టుకు సోమవారం మరోసారి కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. కానీ ఇప్పటి వరకూ నిర్వహించిన టెస్టుల్లో నెగటివ్ అని తేలిన వారిని సైతం హోటల్ గదుల నుంచి బయటకు వెళ్లనీయమని న్యూజిలాండ్ పేర్కొంది. న్యూజిలాండ్‌లో క్వారంటైన్లో ఉన్న పాకిస్థానీ క్రికెటర్లు క్వారంటైన్ నిబంధనలను పదే పదే ఉల్లంఘించారు. భోజనాన్ని పంచుకుంటూ, పక్కన పక్కన కూర్చుంటూ, మాస్క్‌లు ధరించకుండా.. కరోనా రూల్స్‌ను బ్రేక్ చేశారు. మీ వాళ్లు ఇలాగే చేస్తే క్వారంటైన్ నిబంధనలను పాటించకపోతే మీ దేశానికి తిప్పి పంపిస్తామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ సీఈవో వసీం ఖాన్‌ను న్యూజిలాండ్ ప్రభుత్వం హెచ్చరించింది. ఇదే చివరి వార్నింగ్ అని స్పష్టం చేసింది.

న్యూజిలాండ్ వెనక్కి పంపిస్తే దేశం పరువుపోతుంది కాబట్టి.. ఈ 14 రోజులపాటు నిబంధనలను పాటించాలని వసీం ఖాన్ పాక్ క్రికెటర్లను కోరారు. క్వారంటైన్ గడువు ముగిసిన తర్వాత బయటకు వెళ్లొచ్చు, రెస్టారెంట్లకు వెళ్లొచ్చు కానీ అప్పటి వరకూ నిబంధనలను పాటించండని ఆయన తమ క్రికెటర్లను కోరారు.

Tags :
|
|

Advertisement