Advertisement

  • సంక్రాంతి తర్వాత కరోనా సెకండ్ వేవ్ వచ్చే అవకాశం...ఏపీ వైద్య ఆరోగ్య శాఖ

సంక్రాంతి తర్వాత కరోనా సెకండ్ వేవ్ వచ్చే అవకాశం...ఏపీ వైద్య ఆరోగ్య శాఖ

By: Sankar Tue, 15 Dec 2020 9:21 PM

సంక్రాంతి తర్వాత కరోనా సెకండ్ వేవ్ వచ్చే అవకాశం...ఏపీ వైద్య ఆరోగ్య శాఖ


ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి..ఒకానొక దశలో రోజుకు పదివేల వరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి ..కానీ ఇప్పుడు రోజుకు వెయ్యిలోపే నమోదు అయితున్నాయి...అయితే ప్రస్తుతం ఢిల్లీ, కేరళ వంటి రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులను అంచనా వేస్తే ఆంధ్రప్రదేశ్‌లోనూ కరోనా సెకండ్‌ వేవ్‌ వచ్చే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ తాజాగా అంచనా వేసింది.

చలి తీవ్రత పెరిగే కొద్దీ కరోనా తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉంటుందని నివేదికలో స్పష్టం చేసింది. జనవరి 15 తర్వాత కరోనా కేసులు పెరిగే ప్రమాదం లేకపోలేదని పేర్కొంది. సెకండ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు అప్రమత్తం కావాల్సిన అవసరముందని సూచించింది..

కరోనా సెకండ్‌వేవ్‌ అంచనాలపై ప్రభుత్వం ఏడుగురు సభ్యులతో అడ్వైజరీ కమిటీ నియమించింది. ఇందులో నలుగురు నిపుణులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేస్తున్న వారు కాగా, మరో ముగ్గురు ప్రైవేటు ఆస్పత్రులకు చెందిన వారు. వీరిలో కమ్యూనిటీ మెడిసిన్, జనరల్‌ మెడిసిన్, సోషియల్‌ ప్రీవెంటివ్‌ మెడిసిన్, న్యూరో ఫిజిషియన్‌లు ప్రభుత్వం తరఫున ఉన్నారు.

Tags :
|
|
|

Advertisement