Advertisement

కరోనా రికవరి రేట్...రికార్డు స్థాయిలో

By: Anji Wed, 23 Sept 2020 09:04 AM

కరోనా రికవరి రేట్...రికార్డు స్థాయిలో

దేశంలో కరోనా రికవరి రేట్ పెరిగింది. దేశంలో 24 గంటల్లో రికార్డు స్థాయిలో లక్ష మందికి పైగా రోగులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇటీవల కొద్ది రోజుల నుంచి రికవరీల సంఖ్య భారీగా పెరుగుతోంది. సోమవారం ఏకంగా లక్ష మంది కరోనా నుంచి కోలుకోవడంతో మొత్తం రికవరీల సంఖ్య 44 లక్షల 97 వేల 867 కు చేరింది.

మరోవైపు కొత్త కేసుల సంఖ్య కూడా ..రోజూవారీ కేసులతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. 24 గంటల్లో 1,053 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 88 వేల 935 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 9లక్షల 75వేల 861 ఉండగా.. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 17. 54 శాతం ఉన్నాయి.

దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోందని, ప్రస్తుతం ఇది 80. 86 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరణాల రేటు 1.60 శాతానికి పడిపోయిందని తెలిపింది.

Tags :
|

Advertisement