Advertisement

  • కరోనా తగ్గింది అని ఆనందపడేలోపు... గుండెపోటుతో మరణించిన వ్యక్తి

కరోనా తగ్గింది అని ఆనందపడేలోపు... గుండెపోటుతో మరణించిన వ్యక్తి

By: Sankar Mon, 20 July 2020 12:13 PM

కరోనా తగ్గింది అని ఆనందపడేలోపు... గుండెపోటుతో మరణించిన వ్యక్తి



కరోనా వలన అనేక మంది జీవితాలు తలకిందులు అవుతున్నయి ..గవర్నమెంట్ హాస్పిటల్ కు వెళ్తే బెడ్లు దొరుకుతాయో లేదో అని భయం , ప్రైవేట్ హాస్పిటల్ అయితే లక్షల్లో బిల్లు దీనితో ఎం చేయాలో తెలీక సామాన్య మధ్య తరగతి ప్రజలు సతమతం అవుతున్నారు ..అయితే కరోనా తగ్గినా ఒక వ్యక్తి డిశ్చార్జ్ అయ్యే రోజే గుండెపోటుతో చనిపోవడంతో ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు వేసిన బిల్లు చూసే గుండెపోటు వచ్చింది అని అంటున్నారు చనిపోయిన వ్యక్తి బంధువులు..

యాచారం మండలం నజ్దిక్‌సింగారానికి చెందిన వ్యక్తి(55)కి కరోనా సోకడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరాడు. నిత్యం బాధితుడు వీడియో కాల్‌ చేసి ఇంట్లో వారితో మాట్లాడేవాడు. తన ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు వారికి సమాచారం అందించేవాడు. ఇదే క్రమంలో శనివారం రాత్రి కూడా కుమారుడితో కాల్ చేశాడు. ఈ సందర్భంగా ఆస్పత్రి సిబ్బంది సైతం ఆదివారం డిశ్ఛార్జి చేస్తున్నట్లు చెప్పారు. తెల్లారితే ఆస్పత్రి నుంచి వెళ్లిపోదామని ఏంచెక్కా ఇంటికి వెళ్లిపోదామనుకున్నాడు. ఇంతలోనే మృత్యువు అతడ్ని కాటేసింది..

ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందినట్లు ఆస్పత్రి నుంచి ఇంటికి ఫోన్‌ వచ్చింది. రాత్రి తమతో హుషారుగా మాట్లాడిన తండ్రి తెల్లారిసరికి ప్రాణాలతో లేడన్న చేదు నిజాన్ని కుమారులు జీర్ణించుకోలేకపోయారు. ఇంటికి వచ్చి అందరినీ కలుస్తానని కన్నతండ్రి చెప్పిన చివరి మాటలు గుర్తు చేసుకొని కన్నీరుమున్నీరయ్యారు. అయితే ఆసుపత్రి బిల్లు రూ.8లక్షలు వేశారని అదే అతని గుండెపోటుకు కారణమై ఉంటుందని దగ్గరి బంధువులు చెబుతున్నారు.


Tags :
|

Advertisement