Advertisement

  • కర్నూల్ లో తీవ్ర స్థాయిలో కరోనా..గడిచిన 24 గంటల్లో 914 కేసులు నమోదు..

కర్నూల్ లో తీవ్ర స్థాయిలో కరోనా..గడిచిన 24 గంటల్లో 914 కేసులు నమోదు..

By: Sankar Sat, 25 July 2020 12:26 PM

కర్నూల్ లో తీవ్ర స్థాయిలో కరోనా..గడిచిన 24 గంటల్లో 914 కేసులు నమోదు..



జిల్లాలో కరోనా వైరస్‌ విజృంభణ తారాస్థాయికి చేరుతోంది. తాజా హెల్త్‌ బులెటిన్‌ ప్రకారం శుక్రవారం ఏకంగా 914 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 9,615కు చేరింది. ఈ రోజు 8 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 150 మరణించారు. ఈ రోజు వరకు కరోనా నుంచి కోలుకుని 5,331 మంది డిశ్చార్జ్ అవగా.. ప్రస్తుతం 4, 134 మంది కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు.

కాగా గడిచిన 24 గంటల్లో రికార్డుస్థాయిలో కరోనా నిర్ధారణ కేసులు నమోదు అయ్యాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో 8147 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా మరో 49 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 933కు చేరుకుంది.

వారం క్రితం వరకు కూడా ఏపీలో కరోనా మాములు స్థాయిలోనే ఉంది ...అయితే కేవలం వారం వ్యవధిలోనే ఏపీలో కరోనా తీవ్ర రూపం దాల్చింది ..రోజు రోజుకు కేసులు విపరీతంగా పెరుగుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు ..ముఖ్యంగా కర్నూల్ , ఈస్ట్ గోదావరి , వెస్ట్ గోదావరి , వైజాగ్ వంటి జిల్లాలో కేసులు ఎక్కువగా నమోదు అయితున్నాయి

Tags :
|
|
|

Advertisement