Advertisement

  • డీఎండీకే అధినేత విజయ కాంత్‌ కు కరోనా పాజిటివ్..!

డీఎండీకే అధినేత విజయ కాంత్‌ కు కరోనా పాజిటివ్..!

By: Anji Fri, 25 Sept 2020 12:47 PM

డీఎండీకే అధినేత విజయ కాంత్‌ కు కరోనా పాజిటివ్..!

ప్రముఖ తమిళ సినీ నటుడు, డీఎండీకే అధినేత విజయ కాంత్‌ కు కరోనా మహమ్మారి సోకింది. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విజయకాంత్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా, తాజాగా కరోనా పరీక్షలు నిర్వహించడంతో పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. మరోపక్క, తమ అభిమాన హీరోకు కరోనా సోకడంతో అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇటీవల పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనగా, ఆ సమయంలోనే వైరస్ ఎవరి నుంచో అంటుకున్నట్టు తెలుస్తోంది. విజయకాంత్ త్వరగా కోలుకోవాలని తమిళనాడు వ్యాప్తంగా ఆయన అభిమానులు ప్రత్యేక పూజలు ప్రారంభించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్య వర్గాలు వెల్లడించాయి.

Tags :

Advertisement