Advertisement

ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్

By: chandrasekar Wed, 16 Sept 2020 10:36 AM

ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్


దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత అధికంగా వున్న ఈ సమయంలో ముఖ్య మంత్రిని కూడా ఆవహించింది. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండుకు కరోనా పాజిటివ్ గా గుర్తించబడింది. తాను కరోనా పరీక్ష ఆర్టీ పీసీఆర్ చేయించుకోగా మంగళవారం పాజిటివ్‌గా రిపోర్టు వచ్చినట్లు ఆయన తెలిపారు.

అయితే తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పారు. కరోనా మార్గదర్శకాల మేరకు తాను హోం ఐసొలేషన్‌లో ఉంటున్నట్లు పెమా ఖండు ట్వీట్ చేశారు. ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేసుకుని వాటి మార్గదర్శకాలు పాటించాలని సూచించారు.

కరోనా వ్యాప్తి తక్కువగా వున్న అరుణాచల్ ప్రదేశ్‌‌లో కరోనా కేసుల సంఖ్య ఇటీవల పెరుగుతున్నది. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఆరు వేలు దాటగా 11 మంది మరణించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

Tags :
|

Advertisement