Advertisement

మేఘాలయ ముఖ్యమంత్రి 'సంగ్మా' కు కరోనా పాసిటివ్

By: chandrasekar Sat, 12 Dec 2020 11:11 AM

మేఘాలయ ముఖ్యమంత్రి 'సంగ్మా' కు కరోనా పాసిటివ్


కరోనా తీవ్రత రోజు రోజుకి పెరుగుతూనే వున్నాయి. ఇప్పుడు ఈ వైరస్ బారిన పడిన మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ కె సంగ్మా హోమ్ ఐసోలేషన్‌లో వున్నారు. తనకు దెగ్గరగా వున్న అందరూ కరోనా పరీక్షలు చేసుకోవాలని సూచించారు. సంగ్మా కరోనా బారిన పడిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

సోషల్ మీడియాలో అయన తెలిపిన వివరాలు చూస్తే నాకు కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ చేయబడింది. ప్రస్తుతం నేను హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నాను. కానీ తక్కువ లక్షణాలు మాత్రమే నాకు ఉన్నాయి. గత కొన్ని రోజులుగా నాతో కాంటాక్ట్‌లో వున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కరోనా టెస్టులు చేయించుకోవలసిందిగా సూచించారు. గత ఐదు రోజుల్లో నన్ను కలిసిన ప్రతి వక్కరు టెస్టులు చేసుకొని క్షేమంగా ఉండండి అని సంగ్మా తెలిపారు.

ఇంతకు ముందు ముఖ్యమంత్రి కేబినెట్‌లో ఆరోగ్య శాఖ మంత్రి ఏఎల్ హేక్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి స్నైవభలంగ్ ధర్ ఇద్దరూ గత అక్టోబర్ నెలలో కరోనా వైరస్ బారిన పడి ఆ తర్వాత కోలుకున్నారు. మేఘాలయలో ఇంతవరకు 12,586 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు చేయబడ్డాయి. ఇందులో 123 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వివరాలు అందాయి. మాస్కులు ధరించి సాంఘీక దూరం పాటిస్తే వైరస్ బారినుండి జాగ్రత్త పడవచ్చును.

Tags :
|

Advertisement