Advertisement

  • హాలీవుడ్ హాస్యనటుడు కెవిన్హార్ట్ కు కరోనా పాజిటివ్

హాలీవుడ్ హాస్యనటుడు కెవిన్హార్ట్ కు కరోనా పాజిటివ్

By: chandrasekar Wed, 26 Aug 2020 09:21 AM

హాలీవుడ్ హాస్యనటుడు కెవిన్హార్ట్ కు కరోనా పాజిటివ్


ప్రముఖ హాలీవుడ్‌ హాస్యనటుడు కెవిన్‌హార్ట్ మాట్లాడుతూ తనకూ కరోనా పాజిటివ్‌గా తేలిందని ‌ పేర్కొన్నాడు. వ్యాధినుంచి ఇప్పుడు పూర్తిగా కోలుకున్నానని చెప్పాడు. ఒహియోలోని ఎల్లో స్ప్రింగ్స్‌లో డేవ్ చాపెల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘యాన్ ఇంటిమేట్ సోషల్ డిస్టెన్స్డ్ ఎఫైర్ షో’లో ఈ 41 ఏళ్ల స్టాండ్ అప్ కమెడియన్ తన రోగ నిర్ధారణ గురించి వివరించాడు. ఇప్పుడు తాను పూర్తిగా కోలుకున్నట్లు తెలిపాడు. కరోనా ప్రపంచాన్నే గడగడలాడిస్తున్నట్లు తెలిపాడు.

తనకు కరోనా సోకినా విషయం గురించి మాట్లాడుతూ 'సమస్య ఏమిటంటే నేనూ ప్రముఖ నటుడు టామ్ హాంక్స్ మాదిరిగానే కరోనా బాధితుడినే. కానీ నేను దాని గురించి ఆయనలా వివరించలేను. ఎందుకంటే ఆయన నాకన్నా ఫేమస్‌.’ అని వ్యాఖ్యానించాడు. కాగా, ప్రదర్శనలద్వారా వచ్చిన డబ్బులో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షల కోసం చాపెల్‌ 100,000 డాలర్లు ఖర్చు చేశాడు. ఈ షోలో డోనెల్ రావ్లింగ్స్, బిల్ బర్, మిచెల్ వోల్ఫ్, క్వెస్ట్లోవ్, టోబే న్విగ్వేతో సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అమెరికాలో కరోనా చాలా వేగంగా ప్రబలుతున్న విషయం అందరికి తెలిసిందే. అక్కడ కట్టుబాట్లు అంతగా లేనందువల్ల ఎక్కువగా వ్యాప్తి చెందుతావుంది.

Tags :
|

Advertisement