Advertisement

  • ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతికి అతని కుటుంబ సభ్యులకి కరోనా పాజిటివ్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతికి అతని కుటుంబ సభ్యులకి కరోనా పాజిటివ్

By: chandrasekar Mon, 03 Aug 2020 09:40 AM

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతికి అతని కుటుంబ సభ్యులకి కరోనా పాజిటివ్


ఏపీ డిప్యూటీ స్పీకర్ మరియు బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ. ఆయన ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు భార్య, కుమార్తెకు కూడా కరోనా సోకిందని తెలిపారు. ఈ రోజు జ్వరం రావడంతో కరోనా టెస్టులు చేయించాం. రిపోర్టులో పాజిటివ్ వచ్చింది. దీనికి కంగారు పడాల్సిన పనిలేదు. వారం రోజులు హోం క్వారంటైన్ ఉండాలని వైద్యులు చెప్పారు.

కరోనా సోకినా కారణంగా ప్రభుత్వ కార్యక్రమాలను వాయిదా వేస్తున్నాను. నేను ధైర్యంగా ఉన్నాను. చాలా తక్కువ స్థాయిలో వైరస్ తాకింది. ఎలాంటి ఇబ్బంది లేదు. వారం రోజుల్లో మళ్లీ కలుద్దాం. అంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య కొంచెం తగ్గింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 8555 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 1,58,764 కి పెరిగింది. మరోవైపు గత 24 గంటల్లో ఏపీలో 67 మంది కరోనాతో చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1474కి పెరిగింది.

ఆంధ్ర ప్రదేశ్ లో అత్యధికంగా విశాఖ జిల్లాలో 1227 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కర్నూలు జిల్లాలో 996, తూర్పుగోదావరి జిల్లాలో 930 కేసులు వచ్చాయి. చిత్తూరు 781, అనంతపురంలో 696, గుంటూరు 639, విజయనగరం 637, పశ్చిమ గోదావరి 550, శ్రీకాకుళం 492, నెల్లూరు 448, కడప 396, ప్రకాశం 384, కృష్ణా 379 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీలో గడిచిన 24 గంటల్లో కృష్ణాలో 11, గుంటూరు 8, తూర్పుగోదావరి 7, విశాఖపట్నం 7, కర్నూలు 6, నెల్లూరు 6, శ్రీకాకుళం 5, ప్రకాశం 4, చిత్తూరు 3, కడప 3, విజయనగరం 3, అనంతపురం 2, పశ్చిమగోదావరిలో ఇద్దరు చొప్పున మరణించారు.

Tags :

Advertisement