Advertisement

  • చైనా నగరం వుహాన్‌కు వెళ్లిన ఫ్లైట్‌లో 19 మంది భారతీయులకు కరోనా‌ పాజిటివ్‌

చైనా నగరం వుహాన్‌కు వెళ్లిన ఫ్లైట్‌లో 19 మంది భారతీయులకు కరోనా‌ పాజిటివ్‌

By: chandrasekar Tue, 03 Nov 2020 11:25 AM

చైనా నగరం వుహాన్‌కు వెళ్లిన ఫ్లైట్‌లో 19 మంది భారతీయులకు కరోనా‌ పాజిటివ్‌


న్యూఢిల్లీ నుంచి చైనా నగరం వుహాన్‌కు వందేభారత్ మిషన్ విమానంలో 19 మంది భారతీయ ప్రయాణికులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. వందే భారత్‌ మిషన్‌లో భాగంగా అక్టోబర్‌ 30న వూహాన్‌ నగరానికి వెళ్లింది. ఆ విమానంలో 19 మందికి పాజిటివ్‌గా గుర్తించారు. మరో 39 మంది యాంటీబాడీలు గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా, మహమ్మారి బారినపడ్డ భారతీయులను హాస్పిటల్ కు తరలించినట్లు పేర్కొన్నారు.

నవంబర్‌ 13 నుంచి మరో నాలుగు విమానాలు వుహాన్‌కు నడపాలని భావిస్తున్నట్టు కేంద్రం ప్రకటించిన సమయంలో ఈ కేసులు బయటపడటం గమనార్హం. ఈ నెల 13, 20, 27, డిసెంబర్ 4 తేదీల్లో ఎయిర్‌ ఇండియా యోచిస్తున్నట్లు భారత రాయబార కార్యాలయం సోమవారం వెల్లడించింది. ఈ తరుణంలో విమానంలో 19 మందికి కరోనా‌ సోకినట్టు తేలడంతో కలకలం రేగింది. ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా వైరస్‌ వుహాన్‌ నగరంలోనే పుట్టిన విషయం తెలిసిందే. డిసెంబర్‌లో వైరస్‌ వెలుగులోకి వచ్చిన తర్వాత వూహాన్‌ నుంచి ఢిల్లీకి 277 మంది భారతీయులను దేశానికి తీసుకువచ్చింది.

Tags :
|

Advertisement