Advertisement

  • దేశంలో కరోనా వ్యాప్తి సెప్టెంబ‌ర్ 5న 40 ల‌క్ష‌లు... సెప్టెంబ‌ర్ 16 నాటికి 50 ల‌క్షలు...

దేశంలో కరోనా వ్యాప్తి సెప్టెంబ‌ర్ 5న 40 ల‌క్ష‌లు... సెప్టెంబ‌ర్ 16 నాటికి 50 ల‌క్షలు...

By: chandrasekar Thu, 17 Sept 2020 07:55 AM

దేశంలో కరోనా వ్యాప్తి సెప్టెంబ‌ర్ 5న 40 ల‌క్ష‌లు... సెప్టెంబ‌ర్ 16 నాటికి 50 ల‌క్షలు...


దేశంలో ఆర్ధిక స్థితి మందగించడం మరియు నిరుద్యోగం పెరిగిపోవడంతో అన్ లాక్ మొదలు పెట్టడంతో కరోనా వ్యాప్తి అమాంతం పెరిగిపోయింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్రత అంత‌కంత‌కూ పెరుగుతూనే ఉన్న‌ది. గ‌త కొన్ని రోజులుగా రోజూ 90 వేలకుపైగా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. దీంతో సెప్టెంబర్ 16 నాటికి దేశంలో న‌మోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 50 లక్షలకు చేరింది. అయితే, గ‌త 11 రోజుల వ్య‌వ‌ధిలోనే కేసుల సంఖ్య మ‌రింత వేగంగా పెరిగింది. సెప్టెంబ‌ర్ 5న దేశంలో మొత్తం కేసుల సంఖ్య 40 ల‌క్ష‌ల వ‌ద్ద ఉండ‌గా సెప్టెంబ‌ర్ 16 నాటికి అది 50 ల‌క్షలు దాటింది. కాగా, భారత్‌లో తొలి కరోనా కేసు న‌మోదైన‌ప్ప‌టి నుంచి మొత్తం కేసుల సంఖ్య‌ లక్ష మార్కును చేరడానికి 110 రోజులు పట్టింది. అందులోనూ 100వ కేసు న‌మోదు కావ‌డానికి 46 రోజులు ప‌ట్ట‌గా, మ‌రో 64 రోజుల్లోనే ఆ సంఖ్య లక్షకు చేరింది. ఇది క్రమంగా పెరిగేటట్లు తెలుస్తుంది.

ప్రజలు సంచారం అదికమవ్వడంతో ఇప్పుడు కేవ‌లం 11 రోజుల్లోనే 10 ల‌క్ష‌ల కేసులు న‌మోద‌య్యాయి. దేశంలో కొవిడ్‌ మరణాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉన్న‌ది. తొలి కరోనా మరణం మార్చి 12న న‌మోదుకాగా ఏప్రిల్‌ 4 నాటికి ఆ సంఖ్య 99కి చేరింది. కేవలం 24 రోజుల్లోనే 100 మరణాలు న‌మోద‌య్యాయి. ఇక‌, 100 నుంచి వెయ్యి మరణాలు 23 రోజుల్లో న‌మోదుకాగా మరో 50 రోజుల వ్యవధిలో ఆ సంఖ్య‌ వెయ్యి నుంచి పదివేలకు చేరింది. నాటి నుంచి కరోనా మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం 10 రోజుల్లోనే 10 వేల మరణాలు సంభవిస్తున్నాయి. దేశంలో కొవిడ్‌-19 మరణాల రేటు 1.63 శాతంగా ఉంది. సెప్టెంబర్ 15 నాటికి దేశంలో కరోనా మరణాలు 80 వేలు దాటాయి. జనాలు మరింత జాగ్రత్త వహించకుంటే ఇంకా అధికమయ్యేటట్లు కనిపిస్తుంది.

Tags :
|

Advertisement