Advertisement

  • కరోనా రోగులు ఇక్కడ చికిత్స తీసుకుని నయమై సంతోషంగా ఇంటికి వెళ్తున్నారు: మంత్రి శ్రీనివాస్ గౌడ్

కరోనా రోగులు ఇక్కడ చికిత్స తీసుకుని నయమై సంతోషంగా ఇంటికి వెళ్తున్నారు: మంత్రి శ్రీనివాస్ గౌడ్

By: chandrasekar Fri, 25 Sept 2020 11:54 AM

కరోనా రోగులు ఇక్కడ చికిత్స తీసుకుని నయమై సంతోషంగా ఇంటికి వెళ్తున్నారు: మంత్రి శ్రీనివాస్ గౌడ్


రాష్ట్ర ప్రభుత్వం కరోనాపై పోరుకు అన్ని చర్యలు తీసుకుంటున్నదని, భయపడాల్సిన అవసరం లేదని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగరల్ లోని జనరల్ హాస్పిటల్ లో నూతనంగా ఏర్పాటు చేసిన లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్ ను మంత్రి ప్రారంభించారు.

కరోనా రోగులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకును ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. జనరల్ హాస్పిటల్లో అత్యాధునిక సౌకర్యాలతో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ కార్పోరేట్ హాస్పిటల్లో ఇచ్చే చికిత్స స్థానికంగా ఉచితంగా అందిస్తున్నామని మంత్రి తెలిపారు.

కరోనా రోగులు సైతం ఇక్కడ చికిత్స తీసుకుని నయమై సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్తున్నారని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట్ రావు, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్ చైర్మన్ తాటి గణేష్, జనరల్ హాల్సిటల్ సూపరింటెండెంట్ రామ్ కిషన్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Advertisement