Advertisement

  • నానమ్మ అంత్యక్రియలకు ఐసోలేషన్‌ వార్డ్ నుంచి వచ్చిన మనువడు..

నానమ్మ అంత్యక్రియలకు ఐసోలేషన్‌ వార్డ్ నుంచి వచ్చిన మనువడు..

By: Sankar Tue, 21 July 2020 10:41 AM

నానమ్మ అంత్యక్రియలకు ఐసోలేషన్‌ వార్డ్ నుంచి వచ్చిన మనువడు..



కరోనా దెబ్బకు మానవ సంబంధాలకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది ..ఒకప్పుడు మన అనుకున్నవాళ్ళకి ఏ చిన్న కష్టం వచ్చిన తోడుగా చాల మంది ఉండేవారు ..ఇక ఎవరైనా చనిపోతే అందరూ దగ్గర ఉంది అంత్యక్రియలు నిర్వహించి ఆ కుటుంబానికి అండగా ఉండేవారు ..కానీ కరోనా వచ్చిన తర్వాత ఆ సంబంధాలు తెగిపోయాయి ..ఒకరితో ఒకరు కలిసే పరిస్థితి లేదు ..ఎవరైనా చనిపోతే ఇక అంతే సంగతి ..పట్టించుకునే నాధుడే ఉండడు..సరిగ్గా అలంటి సంఘటనే సూర్యాపేట జిల్లా మునగాల లో జరిగింది ..

మునగాలకు చెందిన ఓ వృద్ధురాలికి ముగ్గురు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. ఇప్పటికే కొడుకులందరూ చనిపోయారు. దీంతో ఆమె రెండో కుమారుడి కొడుకు దగ్గరే ఉంటోంది. అనారోగ్యం కారణంగా ఆదివారం ఆమె మృతిచెందింది.

ఆమె మనవడికి కరోనా సోకడంతో వేరే చోట హోం ఐసోలేషన్‌లో ఉంటున్నాడు. ఆమెకు కూడా కరోనా సోకి ఉంటుందనే అనుమానంతో మృతదేహాన్ని చూసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. బంధువులు ఉన్నప్పటికీ వారు కూడా దూరంగానే ఉండిపోయారు. దీంతో ఈ విషయాన్ని గ్రామ పెద్దలు ఐసోలేషన్‌లో ఉన్న మనవడికి ఫోన్ ద్వారా వివరించారు.

ఇలాంటి దుస్థితి తలెత్తినందుకు కుమిలిపోయిన ఆ యువకుడు.. తన పరిస్థితిని గ్రామ పెద్దలకు వివరించాడు. దీంతో వారే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 7 గంటల సమయంలో పీపీఈ కిట్ ధరించిన కరోనా బాధితుడు కార్లో ఇంటికి వెళ్లాడు. తనను అల్లారుముద్దుగా పెంచిన నానమ్మ విగత జీవిగా పడి ఉండటాన్ని చూసి చలించిపోయాడు. కానీ దుఃఖాన్ని దిగమింగుకొని ఒక్కడే ఆమె మృతదేహాన్ని కార్లోకి చేర్చాడు. కారును శ్మశానం దగ్గరకు తీసుకెళ్లి నానమ్మ అంత్యక్రియలు నిర్వహించాడు.

Tags :
|

Advertisement